ఆ పాత్రల కంటే ఆంటీ రోల్స్ నయం.. హీరోయిన్‌కు సిమ్రాన్ దిమ్మతిరిగే జవాబు
దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా ఉన్న వారిలో సిమ్రాన్ కూడా ఒకరు. గ్లామర్‌తోనే కాకుండా పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోవడమే కాకుండా పలు భాషల్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకొన్నారు. కెరీర్ పీక్స్‌లోనే ఉండగానే.. కెరీర్‌కు కొంత విరామం ప్రకటించారు. కాగా, ప్రస్తుతం తన వయసకు తగిన పాత్రలతో ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్దమయ్యారు. అయితే ఇటీవల ఆంటీ పాత్రలు గురించి వచ్చిన చర్చపై ఆమె ఘాటుగా స్పందించారు. ఆమె చేసిన కామెంట్స్ వివరాల్లోకి వెళితే..
సిమ్రాన్ కెరీర్ విషయానికి వస్తే.. తమిళం, తెలుగు సినిమా రంగాల్లో కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున అక్కినేని లాంటి హీరోలతో నటించారు. అలాగే కుర్ర హీరోలతో కూడా జతకట్టారు. అయితే కంటెంట్ ఉన్న పాత్రలే కాకుండా డ్యాన్స్ స్టెప్పులతో ఆలరించే పాత్రతో మెప్పించారు. అయితే తన రూట్ మార్చి పాత్రలకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో సిమ్రాన్ ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశారు. తనకు ఇటీవల ఓ హీరోయిన్ నాకు మెసేజ్ చేసింది. ఆంటీ పాత్రలు వేయవద్దు. ఆంటీ పాత్రలకు దూరంగా ఉండండి అని అన్నారు. ఆ మెసేజ్ చూసి నేను ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. కానీ ఈ వేదిక నుంచి నా మనసులో ఉన్న విషయాలను పంచుకోవాలనుకొంటున్నాను అని సిమ్రాన్ అన్నారు.
నా కొలీగ్ హీరోయిన్ చేసిన సూచనలు నాకు నచ్చలేదు. నాకు డబ్బా రోల్స్ చేయడం ఇష్టం లేదు. దానికి బదులు ఆంటీ రోల్స్ చేయడమే బెటర్. ఆంటీ రోల్స్ చేయడం ఎందుకు తప్పు. మంచి కంటెంట్ ఉండి.. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉంటే తప్పకుండా చేస్తాను. పాత్ర మంచిగా ఉంటే.. ఎలాంటి రోల్స్ అనేది నేను చూడను అని సిమ్రాన్ అన్నారు.
అయితే సిమ్రాన్‌కు చేసిన కామెంట్స్ ఎవరిపై అనే చర్చ జరుగుతున్నది. అయితే సిమ్రాన్‌కు మెసేజ్ చేసింది జ్యోతిక అనే విషయంపై భారీగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. అలాగే నయనతార కూడా కావొచ్చని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవల ఆమె నయనతారతో కూడా కలిసి నటించారు. అయితే ఆంటీ రోల్స్ గురించి సిమ్రాన్ పెద్ద చర్చనే లేవనెత్తారు. అయితే డబ్బా రోల్స్ అంటూ ఆమె కామెంట్స్ చేయడంతో ఇటీవల జ్యోతిక డబ్బా కార్టెల్ అనే హిందీ సినిమాలో నటించడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
సిమ్రాన్ కెరీర్ విషయానికి వస్తే.. 90వ దశకం నుంచి ఇప్పటి వరకు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించారు. ఆమె సుమారుగా 100కుపైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఈ వ్యాఖ్యలకు కారణం.. కన్నతిల్ ముతామిట్టల్ సినిమాలో ఆంటీ రోల్ పోషించారు. ఈ సినిమా గురించే తనకు ఓ హీరోయిన్ మెసేజ్ చేసి ఉంటుందని సిమ్రాన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











