Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Shruti Haasan Breakup: లవర్‌కు శృతి హాసన్ బ్రేకప్.. ఆ విషయం తెలిసిందని.. అందుకే అలా కనిపించిందా!
దిగ్గజ నటుడు, విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది హాట్ బ్యూటీ శృతి హాసన్. అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్న ఈ బ్యూటీ.. వరుస చిత్రాలతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. అదే సమయంలో తన ప్రేమకథలతో నిత్యం దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా శృతి హాసన్ ఓ పోస్ట్ చేయడంతో తన ప్రియుడికి బ్రేకప్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

అలా వచ్చి ఫుల్ పాపులర్
చాలా చిన్న వయసులోనే శృతి హాసన్ సింగర్‌గా పరిచయమై సత్తా చాటింది. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రతో తెరకు పరిచయమైంది. అనంతరం 'లక్' అనే హిందీ మూవీలోనూ కనిపించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టింది.
నటి సురేఖ వాణి అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా వామ్మో!

సీనియర్లతో జోడీ కట్టింది
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో వరుసగా సినిమాలు చేసిన శృతి హాసన్ స్టార్‌గా ఎదిగిపోయింది. మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చింది. అయితే, ఈ మధ్య మాత్రం ఆమె సీనియర్ హీరోలతోనే సినిమాలు చేస్తోంది. ఇలా ఇప్పుడు ప్రభాస్‌తో 'సలార్'తో పాటు బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', చిరంజీవి నటిస్తోన్న 'వాల్తేరు వీరయ్య'లోనూ హీరోయిన్‌గా చేస్తోంది.

ఫారెనర్‌తో ట్రాక్‌ను నడిపి
వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శృతి హాసన్ విదేశీ గాయకుడు మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసింది. అంతేకాదు, అతడిని కమల్ హాసన్‌కు పరిచయం కూడా చేసింది. వీళ్లంతా కలిసి ఓ వివాహ వేడుకలో సైతం పాల్గొన్నారు. ఆ సమయంలో శృతి హాసన్, మైకేల్ కోర్సలే పెళ్లి అని టాక్ వచ్చింది. కానీ, ఆ వెంటనే వీళ్లిద్దరూ విడిపోయి అందరికీ షాక్ ఇచ్చేశారు.
బీచ్‌లో రెచ్చిపోయిన దీపికా పిల్లి: టాప్ కిందకు జరిపి హీటు పెంచేలా!

శాంతనుతో డేటింగ్ చేస్తూ
మైకేల్‌కు బ్రేకప్ చెప్పిన తర్వాత శృతి హాసన్.. డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో ప్రేమాయణం సాగిస్తోంది. అతడితో కలిసి ఒకేచోట ఉంటూ ఈ అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ అతడితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ రచ్చ చేసింది. అలా ఈ బ్యూటీ కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

పెళ్లికి రెడీ అవుతుందని
డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారికాతో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సుదీర్ఘ కాలంగా డేటింగ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అతడితో కలిసి యమ రొమాంటిక్‌గా గడుపుతోంది. ఈ విషయం కమల్ హాసన్‌కు కూడా తెలుసన్న విషయం విధితమే. ఇక, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, కొన్ని డేట్లు కూడా ఇప్పటికే తెరపైకి వచ్చాయి.
Bigg Boss Winner: నాగార్జున సంచలన ప్రకటన.. ఇనాయాతో పాటు మరొకరు ఔట్.. షో చరిత్రలోనే తొలిసారి
ప్రియుడితో శృతి బ్రేకప్
శాంతను హజారికాతో సుదీర్ఘ కాలంగా ప్రేమాయణం సాగిస్తోన్న శృతి హాసన్.. కొద్ది రోజులుగా అతడికి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వీళ్లిద్దరూ విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శృతి హాసన్ తరచూ ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా పోస్టులు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ మరో ఆసక్తికరమైన నోట్‌ను రాసుకొచ్చింది.

ఇన్‌స్టా పోస్టుతో సందేహం
తాజాగా హీరోయిన్ శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'నాతో నేనే సరదాగా ఉంటాను.. నాలా నేను.. నాతో నేను.. ఉంటేనే నాకు బాగుంటుంది.. నా టైం విలువ నాకు తెలుసు.. నా జీవితాన్ని నేను మాత్రమే ఇష్టపడతాను అన్న విషయం తెలుసుకున్నాను. ఇప్పుడు నా స్థాయిని ఎంతో అదృష్టంగా భావిస్తాను' అంటూ రాసుకొచ్చింది. దీంతో బ్రేకప్ వార్తలకు బలం చేకూరింది.