లెజెండరీ హీరోతో విడాకులు..బిల్డింగ్‌పై నుంచి దూకి నటి సూసైడ్ అటెంప్ట్..స్టార్ హీరోయిన్ తల్లి గురించి తెలుసా?

హీరోయిన్ల జీవితాలు ఉన్నట్టుండి అథోపాతాళానికి జారిపోతాయి ఒకప్పుడు దేదిప్యంగా ఉన్న కెరీర్‌ గ్రాఫ్ ఉన్నట్టుండి పడిపోయి దీనస్థితిలోకి వెళ్లిన ఎందరో తారలను చూశాం. చివరకు దిక్కులేని చావుకు గురైన సావిత్రి లాంటి హీరోయిన్ల జీవితాలు ఎప్పటికీ ఓ గుణపాఠంగా కనిపిస్తాయి. అంతలా కాకుండా.. స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో చెలమణి అయిన నటి ఓ దశలో భర్తతో విడాకుల తర్వాత ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆర్థిక చితికిపోయి ఓ దశలో కారులో పడుకొన్న సందర్భాలు ఉన్నాయి. ఆ హీరోయిన్ వివరాల్లోకి వెళితే..

న్యూఢిల్లీకి చెందిన ఓ అమ్మాయి వెండితెర మీద రాణించాలని ముంబైకి చేరుకొన్నది. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగింది. 5 సంవత్సరాల వయసులో బాలనటిగా అందరి ప్రశంసలు అందుకొన్నది. ఆ తర్వాత హీరోయిన్‌గా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మారింది.

Is Shruti Haasan mother Sarika attempted Suicide after divorce with Kamal haasan

ఇక హీరోయిన్‌గా తన కెరీర్ గ్రాఫ్ బ్రహ్మండంగా ఉండటంతో దక్షిణాదికి చెందిన ఓ స్టార్ హీరోతో పరిచయం ఏర్పడటం.. ఆ పరిచయం ప్రేమగా మారింది. దాంతో అప్పటికే వివాహితుడైన ఆ హీరో.. తన భార్యకు విడాకులిచ్చి.. ఈ హీరోయిన్‌ను వివాహం చేసుకొన్నాడు. ఆ తర్వాత వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు.

అయితే అప్పటికి సవ్యంగా సాగుతుందనుకొన్న వారి జీవితంలో అభిప్రాయబేధాలు పొడసూపాయి. దాంతో వారి సంసారంలో కలతలు, కన్నీళ్లు చోటు చేసుకోవడం మొదలు పెట్టాయి. భర్త తనను దూరంగా పెట్టడం మొదలు పెట్టడంతో ఓ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే అదృష్టం బాగుండటంతో గాయాలతో బతికి బట్టకట్టింది. ఆ తర్వాత హీరోతో విడాకులు తీసుకొన్నది.

గతంలో బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలనాటి తార మాట్లాడుతూ.. నా భర్తతో విడాకులు తీసుకొన్న సమయంలో నా వద్ద కేవలం 60 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో స్నానం, బాత్రూం వాడుకోవడానికి నా స్నేహితుల ఇంటికి వెళ్లే దానిని. అర్ధరాత్రి కారులో నిద్రించే దానిని. నా ఇద్దరు పిల్లలు తండ్రితో ఉండాలని నిర్ణయించుకోవడంతో ముంబైకి వచ్చాను అని ఆమె తెలిపారు.

అలాంటి సమయంలో నా తల్లి నాకు తీరని ద్రోహం చేసింది. నేను సంపాదించిన డబ్బుతో కొన్న ఐదు ఫ్లాట్స్‌ను తన పేరు మీద రాయించేసుకొన్నది. దాంతో జీవితంలో మరింత నిరాశ పెరిగింది. దాంతో చట్టపోరాటం చేసి నా ఆస్తులు నాకు వచ్చేలా చేసుకొన్నాను. అప్పటి నుంచి నేను ముంబైలో ఒంటరిగానే బతుకుతున్నాను అని అన్నారు.

Is Shruti Haasan mother Sarika attempted Suicide after divorce with Kamal haasan

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ప్రస్తుత ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్. ఆమె భర్త కమల్ హాసన్. కమల్ హాసన్‌తో పెళ్లి తర్వాత వారిద్దరికి శృతి, అక్షర హాసన్ కలిగారు. అయితే కమల్‌తో విడాకులు కోరుకోనప్పటికీ.. విధి వక్రీకరించడంతో జీవితం దుర్భరంగా మారింది. ప్రస్తుతం శృతి హాసన్ తన తల్లి బాగోగులు చూసుకోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X