జాన్వీ కపూర్‌పై కన్నేసిన స్టార్ హీరోయిన్ భర్త.. అలా చిలిపి పనులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన యువ హీరో
ఇండియన్ యంగ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం పరమ్ సుందరి. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో యువ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతోపాటు సంజయ్ కపూర్, మన్‌జోత్ సింగ్, సిద్దార్థ్ శంకర్, రెంజీ పనికర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందిస్తున్న మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా ఆగస్టు 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా జాన్వీ కపూర్ గురించి, హీరో సిద్దార్థ్ గురించి దుబాయ్ క్రిటిక్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ గురించిన గాసిప్ వివరాల్లోకి వెళితే..
పరమ్ సుందరి సినిమా ప్రమోషన్స్‌ను ముంబైలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జాన్వీ కపూర్, సిద్దార్థ్ చేపట్టారు. ముంబైలో మీడియాకు ఇంటర్వ్యూలతోపాటు ఢిల్లీలో ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే రొమాంటిక్, కామెడీ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ హైలెట్‌గా మారింది. వారిద్దరి మధ్య సన్నిహితంగా ఉన్న అంశాలు అభిమానులను ఆకట్టుకొంటున్నాయి.

అయితే ఢిల్లీలో చేపట్టిన పరమ్ సుందరి సినిమా ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్, సిద్దార్థ్ మధ్య క్లోజ్ సీన్లపై ఉమేర్ సంధూ ట్వీట్లు చేస్తూ ఆసక్తికరంగా కామెంట్ చేశాడు. జాన్వీ కపూర్‌కు నోట్లో స్వీట్ పెట్టి తినిపించిన ప్రతీసారి ఆయన తన చేతి వేలును నాకుతూ కనిపించాడు. కియారా అద్వానీ.. ఓ సారి నీ భర్తపై కన్నేసి ఉంచు. జాన్వీ కపూర్‌తో సరసాలు చేస్తున్నాడు. కాస్త జాగ్రత్త అన్నట్టు ఆయన ట్వీట్ చేశాడు.
జాన్వీ కపూర్ గురించి ఉమేర్ సంధూ ట్వీట్ చేస్తూ.. ఇండియాలో నెపో హీరోయిన్లలో ఆమె హాట్ అండ్ సెక్సీగా యాక్టర్. ఆమె తాను అందంగా కనిపించడానికి, అలాగే హాట్ లుక్‌తో అలరించడానికి ఆమె కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది అని అన్నాడు. అలాగే ఆమె అందానికి యువ హీరో సిద్దార్థ్ పడిపోయాడు. ఆమెను ట్రాప్ చేయడానికి సిద్దార్థ్ తన శక్తికి మించి ప్రయత్నించాడు. పరమ్ సుందరి సినిమా కోసం పనిచేసేటప్పుడు ఆయన ఆమె మత్తులో మునిగిపోయాడు అని ఉమేర్ సంధూ ఓ గాసిప్‌ను సోషల్ మీడియాలో వదిలాడు.
ఇదిలా ఉండగా, జాన్వీ కపూర్ వరుస సినిమాలతో సక్సెస్‌ను సొంతం చేసుకొంటున్నారు. తెలుగులో ఆమెకు ఇటీవల దేవర చిత్రంతో భారీ విజయం దక్కింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఆమె పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో హోమ్ బౌండ్, సన్నీ సంస్కారీ కి తులసి కుమారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా తెలుగులో ఓ టాప్ నిర్మాత, దర్శకులతో చర్చలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











