Sreeleela పేరు మార్చుకోబోతున్న శ్రీలీల.. వరుస ఫ్లాపుల ఎఫెక్ట్.. ఈసారైనా కలిసి వస్తుందా?

అందాల బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టి.. స్టార్ హీరోయిన్ గా మారింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ పట్టేసింది.

అసలు ఒక ఏడాదిలోనే అమ్మడు డజన్ కు పైగా సినిమాలను లైన్లో పెట్టింది. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా అందరూ సినిమాలకు ఓకే చెప్పింది. అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడు అన్నట్లు .. శ్రీలీల ఈ సినిమాలతో హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ పొజిషన్ కు వెళ్ళాలి అనుకుంది.

Is sreeleela changing her name as per numerology for Film Offers and opportunities

కానీ, ఆమె నటించిన ఏ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. దీంతో అమ్మడు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అప్పటిలా ఏ సినిమా పడితే ఆ సినిమా కాకుండా ఇప్పుడు కొద్దిగా కథలను ఏరికోరి ఏంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె కొత్త ప్రాజెక్ట్స్ ను ఏది ఓకే చెప్పడం లేదు.

అందుతున్న సమాచారం ప్రకారం అమ్మడికి అవకాశాలు కూడా రావడం లేదు అంట. అందుకే శ్రీలీల తల్లి ఆమె జాతకం జ్యోతిష్కుల కు చూపించడం జరిగిందట. వారు పేరు బలం కలిసి రావడం లేదని, పేరు మార్చుకుంటే కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారట.

అందుకే శ్రీలీల పంతులు సలహా మేరకు ఆమె పేరులోని అక్షరాలను కొద్దిగా మార్చి కొత్త పేరును పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇండస్ట్రీలో ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. నటీనటులు.. ఎక్కువగా జాతకాలను నమ్ముతారు. ఛాన్స్ లు రాకపోయినా.. విజయాలను దక్కకపోయినా ఇలా జాతకాలు చూపించుకొని పేర్లు మార్చుకుంటూ ఉంటారు.

Is sreeleela changing her name as per numerology for Film Offers and opportunities

ఇప్పటివరకు చాలామంది నటీనటులు తమ పేర్లు మార్చుకున్నారు.. కొందరు.. కొన్ని అక్షరాలను చేర్చుకోగా.. ఇంకొందరు కొన్ని అక్షరాలను తొలగించారు. ఇప్పుడు ఈ భామ కూడా అదే పని చేస్తోంది. శ్రీలీల ఇంగ్లీషు అక్షరాల్లో రెండు 'EE' తీసేసి ఒక 'I'గా మార్చుకుంటే.. ఆమె జాతకంలో మంచి రోజులు వస్తాయి అని చెప్పడంతో ఆమెకు ఇష్టం లేకపోయినా తన పేరును మార్చుకొనే పనిలో పడిందట.

కొన్ని రోజుల్లో ఆమె అధికారికంగా తన పేరును SREELEELA అని కాకుండా SRILEELA అని మార్చుకోనున్నదని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ భామకు కలిసి వస్తుందా..? లేదా ..? అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X