శ్రీలీలపై రూమర్లు.. ఆ హీరోతో అలా అంటూ..!
తెలుగు సినిమా పరిశ్రమలోకి దూసుకొచ్చిన యువ తార శ్రీలీల అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ యంగ్ హీరోయిన్ నటిస్తే చాలూ సినిమా హిట్టు అనే క్రెడిట్‌ను ఆమె సొంతం చేసుకొన్నది. అయితే ఆమె నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాపులు పడటంతో ప్రస్తుతం ఆచితూచీ సినిమాలు ఎంపిక చేసుకొంటున్నట్టు సమాచారం. అయితే తాజా ఇద్దరు అగ్ర హీరోలకు ముడిపెడుతూ వస్తున్న వార్తల వివరాల్లోకి వెళితే..
దక్షిణాదిలో అందం, అభినయం, డ్యాన్సులు, ఫైట్స్ ఇలా అన్ని రకాలుగా చేసి మెప్పించగలిగిన హీరోయిన్లలో ఒకరిగా ప్రేక్షకుల మన్ననలే కాకుండా సినీ వర్గాల ఆదరణను కూడగట్టుకొన్నది. అయితే వరుస హిట్లు, బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో శ్రీలీల ఉంటే చాలూ సినిమా హిట్టే అనే స్థాయిని సంపాదించుకొన్నది. అయితే ఇటీవల ఆమె నటించిన సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయాయి. దాంతో ఆమె దూకుడు తగ్గించినట్టు కనిపించింది.

అయితే తాజాగా శ్రీలీల తమిళ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ రెడీ అయింది. అయితే ఇళయదళపతి విజయ్‌తో ఓ సినిమాలో నటిస్తున్నారనే విషయం సౌత్ మీడియాలో హైలెట్‌గా మారింది. దాంతో శ్రీలీల రేంజ్ మరింత పెరిగిందనే వార్తలు కనిపించాయి. అయితే విజయ్ పక్కన నటిస్తున్నారనే వార్తలు రూమర్లే అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
విజయ్‌తో శ్రీలీల నటిస్తున్నారనే వార్తలు మా దృష్టికి వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదు. ఆమెను సంప్రదించిన మాట వాస్తమే కాని.. ఆ ఆఫర్ మెటీరియలైజ్ కాలేదు. ఆమె విజయ్ సినిమాలో నటించడం లేదు అని క్లారిటీ ఇచ్చారు. దాంతో శ్రీలీల అభిమానులు నిరాశకు గురువుతున్నారు.

అయితే శ్రీలీల అభిమానులు నిరాశకు లోనైన సమయంలో మరో వార్త మీడియాలో కనిపించింది. అయితే విజయ్‌తో కాదు. కానీ అజిత్ సినిమాలో హీరోయిన్‌గా, ఓ కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఫ్యాన్స్ ఈ వార్త నిజమైతే బాగుండని కోరుకొంటున్నారు. అయితే ఈ సినిమాలపై శ్రీలీల క్లారిటీ ఇస్తే.. సందేహాలకు తెరపడుతుందని అంటున్నారు.
ఇక ఇటీవల కాలంలో శ్రీలీల కెరీర్ చూస్తే గ్రాండ్‌గానే ఉంది. గతేడాది భగవంత్ కేసరి చిత్రంతో విజయాన్ని అందుకొన్నది. ఈ ఏడాదిలో గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుతో నటించి హిట్ దక్కించుకొన్నది. యువ హీరోలతో నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. గత రెండేళ్లుగా మిక్స్‌డ్ రెస్సాన్స్‌తో ఆమె కెరీర్ కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











