Sreeleela దుమ్ము రేపుతున్న ధమాకా పాప.. పవన్, మహేష్, బాలయ్యతో రెమ్యునరేషన్ ఎంతంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో మెరుపులా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన పెళ్లి సందD చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అందాల భామ మళ్లీ వెనుకకు చూసుకోలేదు. రవితేజ ధమాకా చిత్రంతో భారీ విజయం సాధించిన తర్వాత శ్రీలీల కెరీర్ గ్రాఫ్ రివ్వున ఎగిసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టులతోపాటు స్టార్ హీరోల పక్కన అవకాశాలు సంపాదించింది. శ్రీలీల చేస్తున్న భారీ సినిమాల వివరాల్లోకి వెళితే..

పెళి సందD సినిమాతో
పెళ్లి సందD సినిమాలో శ్రీలీల నటించడం వల్ల పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఆమె గ్లామర్, అభినయం అందర్నీ ఆకట్టుకొన్నాయి. ధమాకా చిత్రంలో డ్యాన్సులు, స్టెప్పులతో మాస్ పాటలను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ధమాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు సాధించడంలో కీలక పాత్రను పోషించింది.

బోయపాటి, రామ్ పోతినేని మూవీతో
హీరోయిన్‌గా శ్రీలీల క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారింది. శ్రీలీల నటిస్తున్న రామ్ పోతినేని, బోయపాటి శ్రీను సినిమాలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అలాగే జూనియర్ అనే కన్నడ, తెలుగు భాషల్లో వస్తున్న చిన్న చిత్రంలో నటించింది. జూనియర్ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

బాలయ్యతో శ్రీలీల ధమాకా
ధమాకా సినిమా తర్వాత శ్రీలీలను అగ్రహీరోల సినిమాలు వెతుక్కొంటూ వస్తున్నాయి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న #NBK108 చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నది. మార్చి 9వ తేదీన బాలయ్యతో కలిసి షూటింగులో పాల్గొన్నది. అలాగే వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రంలో నటిస్తున్నది. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న SSMB28 హీరోయిన్‌గా నటిస్తున్నది.

విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టితో
శ్రీలీల అధికారంగా చేసిన సినిమాలు ఇలా ఉంటే.. అనధికారంగా మీడియాలో వినిపిస్తున్న సినిమాల్లో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న VD12 చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నది. అలాగే నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రోజు సినిమాలో చిత్రంలో నటించనున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్ కల్యాణ్‌తో
అలాగే పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి ఓకే చెప్పింది. అలాగే నితిన్, వక్కాంతం వంశీ చిత్రంలో కూడా నటించబోతున్నదనే విషయం మీడియాలో వినిపిస్తున్నది. చాలా తక్కువ వ్యవధిలోనే పవన్ కల్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని లాంటి హీరోల పక్కన నటించే అవకాశాలు దక్కించుకొన్న శ్రీలీల టాప్ హీరోయిన్‌గా మారింది.

శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతంటే?
శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే.. తన తొలి చిత్రానికి 5 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొన్నది. ఆ తర్వాత రెండో చిత్రం ధమాకాకు సుమారు 50 లక్షల రూపాయలు అందుకొన్నది. ధమాకా సినిమా హిట్ తర్వాత 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











