శ్రీలీల ఆన్ స్క్రీన్ తొలి లిప్‌లాక్.. ఆ బాలీవుడ్ హీరోతో కాదా? మరెవరితో?
వెండితెరపై చాలా వరకు హీరోయిన్స్ తమ స్కిన్ షో పరంగా ఎంత హద్దులు దాటినా కొన్ని విషయాల్లో మాత్రం ఇంట్రెస్టింగ్ గా చాలా స్ట్రిక్ట్ గానే ఉంటారు. మెయిన్ గా కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో కానీ పెదవి ముద్దులు హాట్ రొమాన్స్ సన్నివేశాలు లాంటి వాటిలో మాత్రం జాగ్రత్తగా ఉంటారు. సోలోగా ఎంతైనా హాట్ నెస్ ని చూపించే హీరోయిన్స్ పార్ట్నర్ తో మాత్రం కొన్ని లిమిట్స్ పెట్టుకున్నామనే చెబుతూ ఉంటారు.
కాగా ఇలా తెలుగు సినిమా దగ్గర కూడా ఓ యంగ్ అండ్ టాప్ బ్యూటీ ఇలాంటి ఫార్మాట్ తో వచ్చింది. కాగా ఆ హీరోయిన్ మరెవరో కాదు వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తున్న టాప్ బ్యూటీ శ్రీలీల. కాగా శ్రీలీల మొదటి రెండు సినిమాల తోనే సత్తా చాటింది. అంతే కాకుండా కొంచెం లిమిటెడ్ గానే హాట్ షో వాటిలో చేసింది కానీ హద్దులు మీరలేదు.

అలాగే ఉండగా ఉండగా కొంచెం కొంచెం డోస్ పెంచుతూ వచ్చి మొన్న పుష్ప 2 సినిమాలో ఫుల్ డోస్ ని చూపించి తనలోనే హాట్ నెస్ ప్రదర్శించింది. కాగా ఇంత చేసినప్పటకీ ఓ సందర్భంలో మాత్రం తాను పెదవి ముద్దు సన్నివేశాలకి వ్యతిరేకమే అని చెప్పుకొచ్చింది. దీనితో శ్రీలీలతో సినిమాల్లో ఏం చేసినా ఇలాంటి సీన్స్ మాత్రం కష్టమే అని అంతా అనుకున్నారు.
కానీ ఊహించని విధంగా ఆ మధ్య తన హిందీ సినిమా అనౌన్సమెంట్ వీడియో టీజర్ లో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో చూపిన రొమాంటిక్ కెమిస్ట్రీ చూసి అంతా ఆ సినిమా తోనే శ్రీలీల మొదటి పెదవి ముద్దు కనిపిస్తోంది అనుకున్నారు. కానీ ఇపుడు ఆ హీరో కాదు మన తెలుగు హీరో తోనే శ్రీలీల తన ఫస్ట్ లిప్ కిస్ పెట్టేసిందా అంటే అవుననే అనిపిస్తుంది.
కాగా శ్రీలీల నటించిన లేటెస్ట్ చిత్రాల్లో యువ హీరో నితిన్ నటించిన చిత్రం రాబిన్ హుడ్ కూడా ఒకటి. కాగా ఈ చిత్రంతో శ్రీలీల నితిన్ సరసన రెండోసారి హీరోయిన్ గా నటించగా మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మరి ఇంట్రెస్టింగ్ గా ఈ ట్రైలర్ లో నితిన్ తో ఆమె లిప్ కిస్ షాట్ వైరల్ గా మారింది. అది కూడా దర్శకుడు ఇంట్రెస్టింగ్ గా ఈ సీన్ ని డిజైన్ చేయడం విశేషం.
కాగా ఈ సీన్ ని చూస్తుంటే ఇద్దరు పెదవి ముద్దు పెట్టుకున్నట్టే ఉన్నారు కానీ సరిగ్గా గమనిస్తే లేదనే కనిపిస్తుంది. దీనితో శ్రీలీల మాత్రం ఇప్పటికీ తాను పెట్టుకున్న రెస్ట్రిక్షన్ ని దాటనట్టే అనుకోవాలి. మరి సినిమాలో ఏమన్నా ఇది క్లియర్ గా ఉంటుందేమో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా ఇక ఈ సినిమాని సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలానే ఈ మార్చ్ 28న గ్రాండ్ గా ఈ చిత్రం విడుదలకి రాబోతుంది.


Click it and Unblock the Notifications











