Sreeleela: హద్దులు చెరిపేస్తున్న శ్రీలీల.. ఫస్ట్ లిప్ లాక్ ఆ హీరోతోనే?
ఇప్పుడు ఉన్న రోజుల్లో తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్స్ కొద్దికొద్దిగా అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తెలుగులో ఎప్పుడో 1980ల సమయంలో తెలుగు వచ్చిన హీరోయిన్స్ ఎక్కువ కనిపించేవారు కానీ ట్రెండ్ మారడంతో మన తెలుగు సినిమాలోనే తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గిపోయాయి.
దీనితో తెలుగులో మళ్ళీ తెలుగు వచ్చిన హీరోయిన్స్ ఆ రేంజ్ స్టార్డంని అందుకునేవారు లేరా అనే సమయంలో వచ్చింది శ్రీలీల. అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ ట్రెండ్ కి తగ్గట్టుగా అన్ని టాలెంట్ లు కలిపి ఇపుడు తెలుగులో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారిపోయింది. కాగా తన రెండో సినిమా నుంచే ఇండియన్ సినిమా దగ్గర ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా తాను మారిపోగా ఇపుడు తెలుగు సహా తమిళ్ లో కూడా సినిమాలు చేస్తుంది.

కాగా శ్రీలీల ఎప్పుడు నుంచో బాలీవుడ్ ఎంట్రీపై కూడా కన్నేసింది కానీ హిందీలో ఎప్పుడు నుంచో తనకి సంప్రదింపులు జరుగుతూ వచ్చాయి కానీ రెండు సార్లు తనకి అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోయాయి. దీనితో శ్రీలీల హిందీ ఎంట్రీ మరింత ఆలస్యం అయ్యింది కానీ ఇపుడు ఫైనల్ గా తన ఎంట్రీ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో ఇవ్వబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.
కాగా అక్కడ యువ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఓ లవ్ సినిమా ఇంకా టైటిల్ పెట్టని సినిమా నుంచి ఇటీవల మేకర్స్ ఒక టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఇందులో శ్రీలీల అందరికీ షాకిచ్చింది అని చెప్పాలి. కార్తీక్ ఆర్యన్ తో ఊహించని రేంజ్ రొమాన్స్ ని తాను చేస్తుంది.
చాలా సీన్స్ ఇద్దరి నడుమ మంచి రొమాంటిక్ గా కనిపిస్తుండగా మన తెలుగులో కూడా చెయ్యని డోస్ ని శ్రీలీల ఇందులో చూపిస్తుంది అని చెప్పాలి. కాగా గతంలో శ్రీలీల సినిమాలో లిప్ కిస్ లాంటి సీన్స్ చేయను అని చెప్పేసింది. ఇలా మిగతా ముద్దులు వరకు ఓకే కానీ పెదవి ముద్దులకి మాత్రం నో చెప్పేది కానీ ఇపుడు ఈ గీతని చెరిపేసినట్టే ఈ టీజర్ లో విజువల్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది.

కాగా ఓ షాట్ లో కార్తీక్ ఆర్యన్ కి పెదవి ముద్దు పెట్టినట్టే కనిపిస్తుంది. దీనితో తన బాలీవుడ్ ఎంట్రీ కోసం తన గీతని చెరుపుకుందో లేదో అనేది ఇంకొన్నాళ్ళు ఆగి చూస్తే తెలిసిపోతుంది. మరి మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే దీపావళి కానుకగా రిలీజ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
మరి ఈ సినిమాతో శ్రీలీలకి బాలీవుడ్ లో ఎంట్రీ ఎలా ఉంటుందో తెలియాలి అంటే అప్పుడు వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా పక్కన పెడితే ప్రస్తుతం తెలుగులో నితిన్ తో నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈ మార్చ్ 28న విడుదలకి రాబోతుంది.


Click it and Unblock the Notifications











