Tamannaah Bhatia : అప్పుడు సమంత.. ఇప్పుడు తమన్నా.. బ్రేకప్ తర్వాత గుండెనిండ బాధను చెబుతూ..!
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా. తొలుత బాలీవుడ్ లోనే మొదటి చిత్రం చేసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు దక్షిణాదినానే హీరోయిన్ గా పాపులారిటీ దక్కింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'హ్యాపీడేస్' సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది తమన్నా భాటియా. అంతకు ముందు కూడా చాలా చిత్రాల్లోనే నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ శేఖర్ కమ్ముల, వరుణ్ సందేశ్ కాంబోలో వచ్చిన ఈ యూత్ ఫుల్ పిక్చర్ తమన్నా కెరీర్ ను మలుపు తిప్పింది. అక్కడ మొదలైన మిల్కీ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సౌత్ ఫిల్మిం ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సౌత్ లోని దాదాపు టాప్ హీరోలు అందరితో తమన్నా భాటియా స్క్రీన్ షేర్ చేసుకుంది. తన అందం, డాన్స్ తో సౌత్ఆడియన్స్ కి గుర్తుండిపోయే చిత్రాలను అందించింది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఎప్పుడూ సినిమాల విషయాలే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరగా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన గురించి క్రేజీ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తమన్నాకు సంబంధించి అభిమానులు ఆందోళన చెందే ఓ విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతుంది.

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే విజయ్ వర్మతో నార్త్ లో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సంగతి కూడా సినీ లోకం గమనిస్తూనే ఉంది. అయితే వారి రిలేషన్షిప్ పై అధికారికంగా ప్రకటించకపోయినా వారి తీరు కన్ఫామ్ చేస్తుంది. ఇక ప్రస్తుతం తమన్నా భాటియా త్వరలో విజయ వర్మను పెళ్లి చేసుకొని వివాహ బంధంలో అడుగు పెట్టాలని ఆలోచిస్తుందట. అందుకే పెద్దగా సినిమాలను కూడా లెక్క చేయడం లేదు. ఇప్పటికే తన లైన్ అప్ లో ఉన్న చిత్రాలను మాత్రమే ఫినిష్ చేస్తున్నది.
విజయ్ వర్మతో పెళ్లి కోసమని కొత్త చిత్రాలకు సైన్ చేయడం లేదని మరో ప్రచారం. ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తమన్నాకు ఊహించని షాక్ తగిలిందని తెలుస్తోంది. తను ఎంతగానో నమ్మిన, మనసిచ్చిన విజయ్ వర్మ పెళ్లికి నో చెప్పారని ప్రచారం జరుగుతుంది. అయితే అప్పటికే ఇటు తమన్నా భాటియా ఇంట్లోనూ అటు విజయ్ వర్మ ఇంట్లోనూ వీరి రిలేషన్ సంగతి తెలిసి ఉండిందంట. కానీ ఎందుకో వీరి అభిప్రాయాలు ఉన్నట్టుండి సరిపోవడంలేదని, అందుకే సెపరేట్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని వాస్తవం అనేలా తమన్నా భాటియా సోషల్ మీడియా వేదికగా పెడుతున్న పోస్టులను పలువురు వైరల్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఆమె ' ప్రేమ ఎప్పుడూ వన్ సైడ్ గానే ఉంటుంది'..... ' ఎలాంటి షరతులు లేకుండా ఉండగలిగేదే ప్రేమ' అంటూ పోస్టులు పెడుతుంది. అయితే దీంతో తమన్నా భాటియా బ్రేకప్ నిజమేనని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రేమలో విఫలమైన కారణంగా తమన్నా తన గుండెలోని బాధను ఇలా వ్యక్తం చేస్తుందని అంటున్నారు. ఇక గతంలో సమంత రూత్ ప్రభు కూడా అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన సందర్భంగా తన బాధను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా పంచుకున్న సంగతి తెలిసిందే. ఇక సమంత తర్వాత తమన్న కూడా అలానే తన బాధను వ్యక్తం చేస్తుందని అంటున్నారు.
ఇక వీలైనంత త్వరగా తమన్నా భాటియా ఇలాంటి పరిస్థితులనుంచి బయటకు రావాలని అభిమానులు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. స్టే స్ట్రాంగ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన కామెంట్స్ తాలూకా పోస్టులకు కామెంట్లు పెడుతూ ధైర్యం చెబుతున్నారు. ఇక తమన్నా భాటియా నెక్స్ట్ ఓదెల 2 చిత్రంతో ఆలోచించడానికి సిద్ధమవుతోంది. ఇక ప్రస్తుతం బ్రేకప్ వార్తలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో మునుముందు తమన్నా భాటియా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











