ఐటెమ్ గర్ల్‌గా తమన్నా భాటియా.. నందమూరి హీరో కోసం స్పెషల్ సాంగ్.. ఎంత డిమాండ్ చేసిందంటే?!

సౌత్ ఫిలిం ఇండస్ట్రీతోపాటు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో కొత్తగా ప్రేమలో పడిన ఈ భామ.. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను ట్రాక్ పెట్టి పరుగులు పెట్టిస్తున్నారు. అయితే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందే బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వార్త వివరాలతోపాటు తమన్నా లైఫ్, ప్రొఫెషనల్ జర్నీ విషయాల్లోకి వెళితే...

విజయ్ వర్మతో డేటింగ్ వార్తలు

విజయ్ వర్మతో డేటింగ్ వార్తలు

తమన్నా భాటియాకు సంబంధించిన అఫైర్లు, డేటింగ్ వార్తలు గతంలో భారీగానే వచ్చాయి. అయితే తాజాగా బాలీవుడ్, టాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్న యువ నటుడితో ప్రస్తుతం లవ్ అఫైర్ కొనసాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెండ్‌గా మీడియా కంటికి చిక్కారు. తన అఫైర్ గురించి ఆమె దాదాపు అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చినంత పనిచేశారు.

స్పెషల్ సాంగ్స్‌తో తమన్నా

స్పెషల్ సాంగ్స్‌తో తమన్నా

ఇక తమన్నా కెరీర్ విషయానికి వస్తే.. గతంలో పలు సినిమాల్లో ఘాటైన పాటల్లో నటించి మెప్పించారు. రాంచరణ్‌తో వాన వాన వెల్లువాయే పాటలో చూపించిన హోయలు సినీ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఇక మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా డాంగ్ డాంగ్ పాట, అలాగే ఎన్టీఆర్‌తో స్వింగ్ జరా, కేజీఎఫ్‌లో మరో స్పెషల్ సాంగ్ లాంటి స్పెషల్ పాటల్లో నటించారు.

NBK108 లో కాజల్ అగర్వాల్

NBK108 లో కాజల్ అగర్వాల్

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తున్నది. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్‌కు భారీగా అంటే 2 కోట్లకుపైగా రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొన్నారు. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణల ఎంపిక శరవేగంగా జరుగుతున్నది. అయితే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నర్తించేందుకు తమన్నా భాటియాతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.

తమన్నాకు కూడా భారీ ఆఫర్

తమన్నాకు కూడా భారీ ఆఫర్

నందమూరి బాలకృష్ణతో కలిసి నటించేందుకు తమన్నా భాటియా ఒకే చెప్పిందనేది సమాచారం. అంతేకాకుండా ఆమె భారీగా రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేసిందని తెలిసింది. గతంలో అనిల్ రావిపూడి సినిమాల్లో నటించడం తెలిసిందే. తాజాగా NBK108 సినిమా కోసం దాదాపు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు సమాచారం.

తమన్నా భాటియా సినిమా కెరీర్ ఇలా..

తమన్నా భాటియా సినిమా కెరీర్ ఇలా..

ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. గతేడాది బాలీవుడ్‌లో బబ్లీ బౌన్సర్, తెలుగులో గుర్తుందా శీతాకాలం, F3 సినిమాల్లో నటించింది. అయితే దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్, రజనీకాంత్‌తో జైలర్, హందీలో బోలె చుడియా, భద్ర అనే సినిమాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X