తమన్నాతో విరాట్ కోహ్లీ!.. ప్రైవేట్ విమానంలో అలా బుక్కైనా మిల్కీ బ్యూటీ
టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతోపాటు బీజిగా ఉన్న తమన్నా భాటియా తాజాగా 11th Hour వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏప్రిల్ 8వ తేదీన రిలీజైన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంటూ ప్రత్యేక జెట్ విమానంలో ప్రయాణించారు. ఈ సందర్బంగా ప్రైవేట్ జెట్ జర్నీ సందర్భంగా తమన్నా వెనుక విరాట్ కోహ్లీ నవ్వుతూ కనిపించడం కనిపించింది. అయితే నిజంగా తమన్నా, విరాట్ కోహ్లీ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించారా అనే విషయం వివరాల్లోకి వెళితే...

11th Hour వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో
ఆహా యాప్‌లో రిలీజైన 11th Hour వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో బిజీగా ఉంటూ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో నా బ్రేక్‌ఫాస్ట్ ఇదే అంటూ చిప్స్ పాకెట్స్, కేక్, బిస్కెట్స్ లాంటి పదార్థాలు ట్రే లో పెట్టుకొని హ్యాపీగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. అయితే వెనుక ఓ అమ్మాయి... మరో కోహ్లీ రూపంలో ఉన్న అబ్బాయి ఫోటోలో కనిపించారు.

ప్రైవేట్ విమానంలో
ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తున్న ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా అది వైరల్ అయింది. దాంతొ తమన్నా తన ప్రైవేట్ జెట్ జర్నీలో విరాట్ కోహ్లీతో ప్రయాణించిందా? విమానంలో కనిపిస్తున్న వ్యక్తి విరాట్ కోహ్లీనా? అతడు కింగ్ కోహ్లీలా కనిపిస్తున్నాడే.. మనమేమైనా పొరబడుతున్నామా? లేక ఆయన ఎవరు అంటూ నెటిజన్ ప్రశ్నలు సంధించారు.

నాతో ప్రయాణించింది ఎవరంటే
అయితే తనతోపాటు ప్రయాణించిన నా మేకప్ ఆర్టిస్టులు ఫ్లోరియన్ హురేల్, నీలమ్ కెనియా అంటూ సమాధానం ఇచ్చింది. విరాట్ కోహ్లీ రూపంలో ఉన్న ఫ్లోరియన్ హురెల్ అంటూ అనేక అనుమానాలకు తమన్నా భాటియా పుల్‌స్టాప్ పెట్టింది. ఫ్లోరియన్ నవ్వితే విరాట్ కోహ్లీలా కనిపిస్తాడు అందుకే పప్పులో కాలేశారంటూ కామెంట్ చేస్తున్నారు.

తమన్నా భాటియా కెరీర్
తమన్నా కెరీర్ విషయాని వస్తే.. 2020లో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో కనిపించారు. 2021లో హీరో గోపిచంద్‌తో సీటీ మార్, మ్యాస్ట్రో, గుర్తుందా శీతాకాలం, ఎఫ్3, దట్ ఈజ్ మహాలక్ష్మీ, హిందీలో బోలే చుడియాన్ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











