అనసూయ షాకింగ్ డెసీషన్: ఆ కారణం వల్లే క్రేజీ ప్రాజెక్ట్‌కు హాట్ యాంకర్ గుడ్‌బై!
అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది హాట్ యాంకర్ అనసూయ. అందంతో పాటు అద్భుతమైన అభినయాన్ని కనబరచ గల నైపుణ్యం ఉండడంతో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పేరును సంపాదించుకుంది. అదే సయమంలో స్టార్‌డమ్‌ను సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమాల విషయంలో ఆమె ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇలాంటి తరుణంలో అనసూయ బూతుల వల్ల ఓ షాకింగ్ డెసీషన్ తీసుకుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

ఎన్టీఆర్ సినిమాతో పరిచయం.. వార్తలు చెప్పి
చదువు పూర్తయిన వెంటనే నటనపై మక్కువతో సినిమా అవకాశాల కోసం ఎదురు చూసింది అనసూయ. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాగ'తో టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ వెంటనే ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు ప్రజెంటర్‌గా పని చేసింది. దీంతో అనసూయ ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. కెరీర్ ప్రారంభంలోనే ఆమె ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

లైఫ్ ఇచ్చిన షో.. జబర్ధస్త్‌గా అనసూయ కెరీర్
న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న సమయంలో అనసూయకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. అదే.. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోది. దీనికి యాంకర్‌గా పరిచయం అయిన తర్వాత అనసూయ కెరీర్ అమాంతం మారిపోయింది. కేవలం ఈ షో వల్లే ఆమె క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. దీంతో టీవీ షోలు... సినిమాల ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

చేసింది తక్కువే.. గుర్తుండేలా కనిపించింది
చేసింది తక్కువ సినిమాలే అయినా కలకలం గుర్తుండిపోయే పాత్రలు చేసింది అనసూయ. వాస్తవానికి ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని కీలకమైన పాత్రలు చేసింది. అలాగే, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం నటించింది. అనసూయ నటించిన చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్ని నాయన', ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర'కు మంచి పేరొచ్చింది.

ఎప్పుడూ అక్కడే... వివాదాలతో సతమతం
టీవీ షోలు.. సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోన్న అనసూయ... సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో సామాజిక అంశాలపై స్పందిస్తోంది. అలాగే, హాట్ ఫొటోలు సైతం షేర్ చేస్తోంది. దీంతో నెటిజన్ల నుంచి విమర్శల పాలవుతోంది.

కీలక టైమ్‌లో అనసూయ షాకింగ్ డెసీషన్
గత ఏడాది అనసూయ ‘కథనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో ఆమె సినిమాల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అనసూయ ఓ షాకింగ్ డెసీషన్ తీసుకుందని ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఆ బూతుల వల్లే మనసు మార్చుకుందా.?
బాలీవుడ్‌లో హిట్ అయిన ‘అంధాధున్'లో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న ఈ మూవీలో నితిన్ హీరోగా చేస్తున్నాడు. అడల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో అనసూయ నటిస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆమె తప్పుకుందని అన్నారు. తాజా సమాచారం ప్రకారం ఆమె మనసు మార్చుకోడానికి బూతులే కారణమట.
Recommended Video

గ్లామర్‌గా కనిపించడానికి మాత్రం పచ్చజెండా
ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే, టబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అంధాధున్'. తెలుగులో నితిన్, నభా నటేష్ చేస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యం కలిగిన టబు పాత్రకే అనసూయను అనుకున్నారు. ఆ పాత్ర గ్లామర్‌గా కనిపించడానికి తోడు బూతులు మాట్లాడాల్సి ఉంటుంది. అయినా, ఈ పాత్రకు ఎంతో పేరొచ్చింది. అలాంటి దాన్ని ఆమె వదులకోవడం షాకిస్తోంది.


Click it and Unblock the Notifications











