కాజల్ కు మరోసారి అన్యాయం.. ఆచార్యకి అలా?..ఇండియన్ 2 ఇలా?
ఇండియన్ సినిమా దగ్గర కొన్ని సెంటిమెంట్ లని కొందరు ఫిలిం మేకర్స్ బాగానే ఫాలో అవుతూ ఉంటారు. అది సినిమా టైటిల్స్ నుంచి కానీ హీరో, హీరోయిన్ కాంబినేషన్ కోసం కానీ ఇంకా చాలా ఫ్యాక్టర్ లలో ఈ సెంటిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మన టాలీవుడ్ లోనే దర్శకుడు రాజమౌళితో సినిమా చేస్తే ఆ హీరో నెక్స్ట్ సినిమా డెఫినెట్ గా ప్లాప్ అవుతూనే వస్తూ ఉంది.
ఇలా ఈ రకంగా అయితే పలు సెంటిమెంట్స్ ఎప్పటికప్పుడు కొన్ని మారుతూనే ఉన్నాయి. అయితే మన తెలుగు సినిమా దగ్గర ఇంకొన్ని మెయిన్ గా హీరోయిన్స్ విషయంలో కూడా బాగానే ఫాలో అవుతారు. ఓ హీరోయిన్ కంటిన్యూస్ గా ప్లాప్ లు ఇస్తే ఐరన్ లెగ్ అని ఒకవేళ హిట్స్ ఇస్తే గోల్డెన్ లెగ్ అని ఒకవేళ హిట్స్ ఇచ్చిన హీరోయిన్ నే ప్లాప్ లు ఇస్తే మళ్ళీ ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు.

కాగా ఇప్పుడు ఇది కాజల్ దగ్గరకి వచ్చింది. సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి క్రేజ్ కాజల్ అగర్వాల్ కి ఉన్నా సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఆమె నటించిన రీసెంట్ చిత్రం "సత్యభామ" తో పలకరించింది. ఇక నెక్స్ట్ కమల్ హాసన్ శంకర్ సినిమా ఒకటి బాలన్స్ ఉంది. అయితే ఇప్పుడు రానున్న ఇండియన్ 2 కాకుండా ఇండియన్ 3 లో కాజల్ ఉంటుంది అని మేకర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు.
కాగా ఇప్పుడు కాజల్ ని అయితే ముందుగా పార్ట్ 2 లోనే చూపించాల్సి ఉంది. కానీ ఈమె పోర్షన్ ని అక్కడ తొలగించి పార్ట్ 3 కి షిఫ్ట్ చేశారు. దీనితో మళ్ళీ కాజల్ విషయంలో ఆచార్య వైబ్స్ కానీ కనిపిస్తున్నాయా అనే టాక్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో చేసిన మొట్ట మొదటి సినిమాగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేయగా ఈ సినిమాకి కూడా మొదట ఆమెపై కొన్ని సీన్స్ షూట్ చేశారు.

కానీ సినిమా రిలీజ్ చేసేటప్పటికి మాత్రం అసలు సినిమాలో ఆమె ఎక్కడ కనిపించకుండా అన్నీ తీసేసి రిలీజ్ చేశారు. మరి ఇదే విధంగా ఇప్పుడు ఇండియన్ 2 కి కూడా చేసి ఆమె సీన్స్ ని సెకండ్ పార్ట్ లో లేకుండా మూడో పార్ట్ లో ఉంటాయని తెలిపారు. కాగా అసలు రెండో పార్ట్ హిట్ అయితేనే పార్ట్ 3 వస్తుందో లేదో అనేది ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ ఆచార్య సెంటిమెంట్ గాని రిపీట్ అవుతుందా అనే అనుమానాలు కొందరిలో లేకపోలేవు.
అయితే శంకర్ అండ్ టీం చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు కానీ రిలీజ్ ఆయె వరకు మాత్రం ఏమి చెప్పడానికి లేదు. కాగా ఈ సినిమాలో మరో హీరో సిద్ధార్థ్ కూడా నటించగా తన సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అలాగే ఈ సినిమాకి సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం అందించగా లైకా సంస్థ నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కి రాబోతుంది.


Click it and Unblock the Notifications











