స్టార్ హీరోయిన్ కాపురంలో తృప్తి డిమ్రీ చిచ్చు... ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో..!
సోషల్ మీడియాలో ఏ హీరో హీరోయిన్ల మధ్య ఎప్పుడు ప్రేమ పుకార్లు పుడతాయో చెప్పడం కష్టమే. అయితే ఇలా రూమర్స్ క్రియేట్ కావడానికి వాళ్ళ పర్సనల్ విషయాలకన్నా సినిమాలే ఎక్కువగా కారణం అవుతూ ఉంటాయి. సినిమాలోని పలు రొమాంటిక్ సీన్లలో వాళ్ళు ఎంత ఇంటెన్స్ గా నటిస్తే రూమర్లు కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. తాజాగా యానిమల్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి కూడా ఇలాగే ఓ స్టార్ హీరో కాపురంలో చిచ్చు పెట్టింది అనే వార్త వైరల్ అవుతుంది. మరి ఈ బ్యూటీ ఏ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడిందో తెలుసుకుందాం పదండి.
సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో రొమాంటిక్ లెవెల్ సౌత్ తో పోల్చుకుంటే చాలా ఘాటుగానే ఉంటుంది. తాజాగా త్రిప్తి నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించిన టీజర్ వల్ల ఆమెతో పాటు అందులో నటించిన స్టార్ హీరోపై దారుణంగా ట్రోల్ నడుస్తోంది. ఆ మూవీ మరేదో కాదు బ్యాడ్ న్యూస్. విక్కీ కౌశల్, తృప్తి ప్రధాన పాత్రల్లో నటించిన బాడ్ న్యూస్ మూవీ జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది..

యానిమల్ తర్వాత త్రిప్తి నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా మ్యూజికల్ ట్రీట్ ఇవ్వడం మొదలుపెట్టారు మేకర్స్. అందులో భాగంగానే త్రిప్తి విక్కీ కౌశల్ తో రొమాంటిక్ గా ఉన్న ఫోటోను షేర్ చేసింది. అందులో జానమ్ అనే సాంగ్ జూలై 9న రిలీజ్ కాబోతోందని అనౌన్స్ చేశారు. మరోవైపు మేకర్స్ ఈ పాటకు సంబంధించిన చిన్న టీజర్ ను వదిలారు.
ఇక అందులో వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ ఎంత ఘాటుగా ఉందంటే హాటెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఇచ్చేయొచ్చు. ఆ పాటలో వీళ్ళిద్దరినీ చూశాక ఈ హీరోయిన్ విక్కీ కౌశల్ కాపురంలో చిచ్చు పెడుతుందా అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్. నిజానికి విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ తన భర్తకు సపోర్టుగా ఎప్పుడూ పలు పోస్టులు చేస్తూ ఉంటుంది.

మరి ఈ సాంగ్ టీజర్ ను చూశాక ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందోనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటిదాకా అయితే కత్రినా ఈ పాట గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ అందరూ ఆమె రియాక్షన్ గురించే ఎదురు చూస్తున్నారు. ఇటీవలే అలియా కూడా రణవీర్ సింగ్ తో రెచ్చిపోయి నటించగా, దీపికా నేనేం తక్కువ అన్నట్టుగా పెళ్లయ్యాక బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చింది. ఇప్పుడు విక్కీ కౌశల్, త్రిప్తి అదే లిస్ట్ లో చేరిపోయారు.
పైగా ప్రస్తుతం కత్రినా విదేశాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో విదేశాల్లో భార్యను వదిలేసి విక్కీ కౌశల్ ఇలా తృప్తితో రెచ్చిపోతున్నాడు అంటూ కత్రినా ఫాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు కత్రినా నీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చింది భయ్యా అని ఒకరంటే, ఆమె విదేశాల్లో ఉండడం వల్ల బాగానే ఎస్కేప్ అయ్యావు అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వివాదం కారణంగా సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోంది. మరి మూవీ రిలీజ్ అయ్యాక ఈ వివాదం సద్దుమణుగుతుందా ? అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











