ఆ స్టార్ హీరోయిన్‌తో గొడవపడి కొట్టుకోవడం వరకు.. వివాదంపై త్రిష క్లారిటీ
ఇండస్ట్రీ.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎన్ని ప్రశంసలు ఉంటాయో.. అన్ని విమర్శలు కూడా ఉంటాయి. ఎంతమంది స్నేహితులు ఉంటారో.. అంతమంది శత్రువులు కూడా ఉంటారు. పక్క పక్కన ఉంటున్న పట్టించుకోనివారుంటారు. ఎన్నో ఏళ్లుగా మాట్లాడుకోనివారుంటారు. కోపాలు, పగలు పెంచుకున్నవారు కూడా ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య క్లాషెస్ ను ఎప్పుడు చూస్తూనే ఉంటాం.
అప్పట్లో శ్రీదేవి, జయప్రద అస్సలు మాట్లాడుకునేవారు కాదట. కానీ, వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. షాట్ లో నవ్వుకుంటూ అక్కాచెల్లెళ్లుగా నటించిన వీరు.. షాట్ అవ్వగానే ముఖముఖాలు కూడా చూసుకునేవారు కాదట. అయితే అది కేవలం ప్రొఫెషనల్ గొడవలు అని మాత్రం ఇండస్ట్రీలో టాక్. ఇక ఈ ఇద్దరు హీరోయిన్స్ లానే కోలీవుడ్ ఇండస్టర్లో మరో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య గొడవ జరిగింది అంట. అది కూడా వృత్తిపరంగా కాదు.. వ్యక్తిగతంగా అంట. మరి ఆ గొడవ ఏంటి.. ఆ హీరోయిన్స్ ఎవరు చూద్దాం.

కోలీవుడ్ హీరోయిన్లు త్రిష,నయనతార మధ్య విభేదాలు ఉన్నాయా..? వారి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉందా..? అంటే నిజమే అని త్రిష కూడా ఒప్పుకుంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తూనే ఉంది. దానికి కారణం ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు.
కోలీవుడ్ కు మొదట పరిచయం అయ్యింది త్రిష. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం 40 వ పడిలో పడింది. ఇక త్రిష తరువాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నయన్.. ప్రస్తుతం అమ్మడు కూడా 40 కు దగ్గరలో ఉంది. ఇద్దరు కూడా కోలీవుడ్ ను ఏలినవాళ్లే. ఒకానొక సమయంలో మంచి స్నేహితులుగా మెలిగినవాళ్లే. కానీ, ఒక సినిమా విషయంలో జరిగిన గొడవ వీరిని విడదీసిందని టాక్.

గతంలో నయన్.. కురివి అనే సినిమా కోసం హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. కానీ చివరిలో ఆమె స్థానంలోకి త్రిష వచ్చింది. ఈ సినిమాతోనే ఈ ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.. అప్పటి నుంచి నయన్.. త్రిష పై కోపం పెంచుకుందని, ఆ కోపంతోనే ఇప్పటివరకు కూడా వారు మాట్లాడుకోరని వార్తలు వినిపించాయి. ఇక ఇది కాకుండా ముందు వచ్చిన త్రిష స్టార్ డమ్ కంటే.. నయన్ ఎక్కువ స్టార్ డమ్ అందుకోవడంతో.. ఆమెపై త్రిష కూడా కోపం పెంచుకుందని మరికొందరు చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండు కారణాలు నిజం కాదట. వీరిద్దరి మధ్య ఉన్నవి వృత్తిపరమైన గొడవలు కాదని, పర్సనల్ గొడవలని స్వయానా త్రిషనే ఒప్పుకోవడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తుంది.
ఒక ఇంటర్వ్యూలో త్రిష.. నయన్ తో ఉన్న గొడవలపై ఓపెన్ అయ్యింది. తమ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు ఒప్పుకుంది. " మా ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు వృత్తిపరమైన కారణాల వల్ల వచ్చినవి కాదు.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జరిగాయి. సమయం గడిచేకొద్దీ మేము ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మేము మంచి స్నేహితులుగా మారాము" అని చెప్పుకొచ్చింది. అయితే ఈ హాట్ బ్యూటీస్ మధ్య వైరం వచ్చేంత పర్సనల్స్ ఏముంటాయో అని అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక వీరి కెరీర్లు గురించి చెప్పాలంటే ప్రస్తుతం త్రిష విశ్వంభర లో నటిస్తుండగా.. నయన్ కోలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంది.


Click it and Unblock the Notifications











