‘త్రిష రాజకీయాల్లోకి రావాలి.. జయలలితతో ఆమెకు అలాంటి కనెక్షన్’

గత కొంతకాలంగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు తోడు విజయ్ రాజకీయాల్లోకి వెళ్లినప్పటి నుంచి నేటి వరకు ప్రస్తుతం పరిణామాలన్నీ త్రిష చుట్టూనే తిరుగుతున్నాయి. ఇదే సమయంలో త్రిష తన సినీ కెరీర్‌కు గుడ్ బై రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారంటూ తమిళ మీడియా కోడై కూస్తోంది. సీఎం విజయ్ ఖాళీ చేయనున్న తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో త్రిష పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా త్రిష పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి వనితా విజయ్ కుమార్.

త్రిషకు విజయ్‌కి ఉన్న ఫ్రెండ్‌షిప్‌పై తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ పడిన వెంటనే తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలకు తోడు.. విజయ్ సతీమణి సంగీత చేసిన ఆరోపణలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయినప్పటికీ విజయ్ కానీ, త్రిష కానీ వీటిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విజయ్.. ద్రవిడ రాజకీయ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేలను మట్టి కరిపించారు. మెజారిటీ మార్కుకు 10 సీట్ల దూరంలోనే టీవీకే పరిమితం కావడంతో చిన్నాచితకా పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Is Trisha Krishnan Entering Politics Vanitha Vijaykumar s Comments Spark Debate

ఎన్ని ఆరోపణలు వచ్చినా.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ విజయ్‌కి అండగా నిలిచారు త్రిష. ఎన్నికల్లో టీవీకేకు ఓటు వేశానని పరోక్ష సంకేతాలు ఇచ్చిన ఆమె.. కౌంటింగ్ రోజు ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకుని నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటు సంక్లిష్టంగా మారుతున్న దశలో త్రిష కీలకపాత్ర పోషించారని వార్తలు వచ్చాయి. నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష హాజరై సందడి చేశారు. ఈ పరిణామాలు అనేక అనుమానాలకు తావిచ్చాయి. ఖచ్చితంగా విజయ్- త్రిష త్వరలోనే పెళ్లి చేసుకుంటారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక తిరుచ్చి ఈస్ట్‌లో జరగబోయే ఉప ఎన్నికలో త్రిష పోటీ చేసి టీవీకే ప్రభుత్వంలో కీలప పదవిని అందుకుంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందని, ఏదో ఒక రోజు తమిళనాడుకు ముఖ్యమంత్రి అవుతానని త్రిష వ్యాఖ్యానించారు.

తాజాగా త్రిష రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె సన్నిహితురాలు, నటి వనితా విజయ్ కుమార్. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. త్రిష రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి?రాజకీయాల్లోకి వెళ్లడానికి కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయి. తనకు ఇంగ్లీష్ బాగా వచ్చు.. ప్రజల్లోకి దూసుకెళ్తుంది, తోటివారితో ఎలా మెలగాలనే విషయాలు తనకు బాగా తెలుసు. టీవీకే తరపున త్రిష అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారన్న వదంతులను ట్రోల్ చస్తున్న వారిపై వనిత మండిపడ్డారు. త్రిష రాజకీయాల్లోకి రావడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చదువుకున్న పాఠశాలలోనే త్రిష కూడా చదువుకున్నారు. త్రిష వంటి వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వ్యాఖ్యలు వనితా విజయ్ కుమార్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. త్రిష రాజకీయాల్లోకి రావడం లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సంకేతం లేదు. సూర్యతో కలిసి నటించిన కరుప్పు మూవీ ఘన విజయం సాధించడం, తన సన్నిహితుడు విజయ్ ముఖ్యమంత్రి కావడంతో త్రిష సక్సెస్ జోష్‌లో ఉన్నారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ఆమె త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X