మాజీ లవర్స్ క్లోజ్‌ఫ్రెండ్స్‌గా.. రానాపై పరోక్షంగా త్రిష ఎటాక్!

అందాల తార త్రిష కృష్ణన్ దశాబ్దానికిపైగా టాప్ హీరోయిన్‌గా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ.. కుర్ర హీరోయిన్లకు ధీటుగా అవకాశాలను దక్కించుకొంటున్నది. అయితే రానా పెళ్లి వార్త తర్వాత త్రిష మీడియాలో ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. రానా, త్రిష మధ్య అఫైర్ గురించి పలు కథనాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ఆమె ఆసక్తికరమైన కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు త్రిష చేసిన కామెంట్ ఏమిటంటే..

రానా, త్రిష అఫైర్

రానా, త్రిష అఫైర్

గతంలో రానా, త్రిష మధ్య అఫైర్ కొనసాగిందనే విషయం అందరికి తెలిసిందే. తన అఫైర్ విషయాన్ని కరణ్ జోహర్ షోలో రానా స్వయంగా వెల్లడించారు. త్రిషతో తన అఫైర్ నిజమే.. తామిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మళ్లీ ఫ్రెండ్స్ మాదిరిగానే ఉండాలని అనుకొన్నాం అని రానా చెప్పారు.

మాజీ లవర్స్ దీవెనలు అంటూ

మాజీ లవర్స్ దీవెనలు అంటూ

మిహికా బజాజ్‌తో పెళ్లి వ్యవహారాన్ని బయటకు వెల్లడించిన తర్వాత రానా తొలిసారి లక్ష్మి మంచుతో ఇన్స్‌టాగ్రామ్‌ లైవ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా గర్ల్‌ఫ్రెండ్స్, మాజీ ప్రియురాళ్లను ఎలా మేనేజ్ చేశావంటూ అడిగిన ప్రశ్నకు రానా సమాధానం ఇస్తూ.. నా పెళ్లి వార్త వినగానే నా గర్ల్‌ఫ్రెండ్స్ సానుకూలంగా స్పందించారు. చాలా హ్యాపీగా ఫీలవుతూ దీవెనలు, శుభాకాంక్షలు కూడా తెలిపారు అని చెప్పారు.

ఉబెర్ ట్వీట్‌పై స్పందన

ఉబెర్ ట్వీట్‌పై స్పందన

ఇదిలా ఉండగా.. ఉబెర్ ట్విట్టర్ అకౌంట్‌లో ఓ కొటేషన్‌పై ఆసక్తికరమైన కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉబెర్ ఫ్యాక్ట్ అకౌంట్ ట్వీట్ ప్రకారం.. చాలా మంది కొన్ని పరిస్థితుల కారణంగా తమ మాజీ ప్రియురాళ్లను క్లోజ్ ఫ్రెండ్స్‌గా మార్చుకొంటారు. కానీ వారితో అతిసన్నిహితంగా ఉంటూనే వారిని పిచ్చిగా ఆరాధిస్తుంటారు. ఈ విషయం జర్నల్ పర్సనాలిటీ అండ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైంది అని పేర్కొన్నది.

ఆ విషయం నాకు తెలుసు

ఆ విషయం నాకు తెలుసు

ఉబెర్ ఫ్యాక్ట్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ.. త్రిష ఆ విషయం నాకు తెలుసు అంటూ కామెంట్ విసిరింది. దాంతో ఆమె ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేసి ఉంటారనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఆ కామెంట్ తన మాజీ ప్రియుడు రానాను ఉద్దేశించి చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. రానా పెళ్లి విషయంలో ఆమె ఏమైనా మనస్తాపానికి గురయ్యారా అనే కోణంలో వాదనలు వినిపిస్తున్నాయి.

Recommended Video

Miheeka Bajaj Revealed The Actual Meaning Behind The Special Tattoo
నార్సిసిస్టిక్ డిజార్డర్ అంటే

నార్సిసిస్టిక్ డిజార్డర్ అంటే

నార్సిసిస్టిక్ డిజార్డర్ అంటే.. ఇది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అత్యధికంగా మరొకరిపై ఆరాధనాభావం ఉండటం, ఇతరుల ఫీలింగ్స్‌ను పట్టించుకోకపోవడం, తమపై వచ్చే విమర్శలను హ్యాండిల్ చేయలేకపోవడం లాంటి అంశాలు వ్యక్తిగత లోపాలుగా కనిపిస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X