12 కోట్ల ఆఫర్‌ను త్రిష రిజెక్ట్.. రజనీ, కమల్, ఉదయ నిధి స్టాలిన్‌కు షాక్!

తమిళనాడు సినీ, రాజకీయ రంగాల్లో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు మార్మోగుతున్నది. విజయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే ఊహాగానాల నేపథ్యంలో త్రిష గురించి మీడియాలో రకరకాల కథనాలు విస్తృత్తంగా ప్రచారం అవుతున్నాయి. కేవలం రాజకీయ రంగానికి సంబంధించిన రూమర్లే కాకుండా సినీ రంగానికి చెందిన గాసిప్స్ ఈ మధ్య కాలంలో భారీగా వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు, తమిళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఇచ్చిన భారీ ఆఫర్‌ను త్రిష నిర్మొహమాటంగా తిరస్కరించిందనే విషయం తమిళ మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. అయితే త్రిషకు ఉదయనిధి ఇచ్చిన ఆఫర్ ఏమిటి? ఆమె ఎందుకు తిరస్కరించారనే వివరాల్లోకి వెళితే..

తమిళనాడు సీఎం, దళపతి విజయ్‌తో త్రిష డేటింగ్ వ్యవహారం మీడియాలో సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా మారింది. అయితే తన పేరును విజయ్‌తో జోడించినప్పటికీ.. త్రిష తమ బంధం గురించి ఎక్కడా కూడా మాట జారకుండా జాగ్రత్త పడుతున్నది. అలాగే విజయ్ కూడా త్రిషతో తన రిలేషన్‌షిప్‌ గురించి ఎక్కడా ప్రస్తావించకుండా చూసుకొంటున్నాడు. అయితే విజయ్‌తో రిలేషన్ కారణంగానే ఆమె భారీ ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారనే విషయం భారీ చర్చకు దారి తీసింది.

Trisha rejects Udhanidhi Stalin offer

అయితే తమిళ, జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఓ భారీ ప్రాజెక్టును రెడ్ జెయింట్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్‌తో భారీ ప్రాజెక్టును నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్నది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం త్రిషను సంప్రదించారు. కొన్ని రోజులుగా చర్చలు జరిగాయి. ఆమెకు 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేశారు. కానీ తమిళనాడు సినీ, రాజకీయ రంగాల్లో ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాల కారణంగా ఆమె ఉదయనిధి స్టాలిన్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు అనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

Also Read
Trisha Remuneration: త్రిష కృష్ణన్ రెమ్యునరేషన్ ఎంత? కరుప్పు కోసం పారితోషికం ఎన్ని కోట్లంటే?
Trisha Remuneration: త్రిష కృష్ణన్ రెమ్యునరేషన్ ఎంత? కరుప్పు కోసం పారితోషికం ఎన్ని కోట్లంటే?

అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో ఉన్న అనుబంధం కారణంగానే ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేసింది. విజయ్‌తో ఉన్న బంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రాజకీయ ప్రత్యర్థి ఉదయనిధి ఇచ్చిన ఆఫర్‌ను నిర్మోహమాటంగా తిరస్కరించారు అనే కథనం ట్రెండింగ్‌లో ఉంది. ఈ విషయం గురించి టైమ్స్ నౌ ప్రసారం చేసిన కథనం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది. అయితే ఈ ఊహాగానాలపై త్రిష గానీ, ఉదయనిధి స్టాలిన్ గానీ క్లారిటీ ఇస్తే ఈ వార్తకు పుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.

Recommended For You
Karuppu Movie Review: కరుప్పు (వీరభద్రుడు) మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Karuppu Movie Review: కరుప్పు (వీరభద్రుడు) మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇక త్రిష విషయానికి వస్తే.. తాజాగా ఆమె నటించిన కరుప్పు చిత్రం సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. దాంతో తమిళ సినిమాలకు, స్టార్ హీరోలకు ఆమె లక్కీ చార్మ్‌గా మారింది. ఆమె ఇటీవల నటించిన లియో, గుడ్ బ్యాడ్ అగ్లీ, పొన్నియన్ సెల్వన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేశాయి. ప్రస్తుతం కరుప్పు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ఈ సినిమా కోసం ఆమె 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ స్వీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.

You May Also Like
'విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. ఆయనంటే నాకు ఇష్టం.. ఆ కోరిక తీరలేదు’
'విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. ఆయనంటే నాకు ఇష్టం.. ఆ కోరిక తీరలేదు’

త్రిషా కెరీర్ విషయానికి వస్తే.. విజయ్‌తో కలిసి లియో, గోట్ చిత్రాల్లో నటించిన తర్వాత.. అజిత్‌తో కలిసి విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ చిత్రాల్లో నటించింది. సూర్యతో కరుప్పు, చిరంజీవితో విశ్వంభర, మలయాళ చిత్రం రామ్‌లో సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో కలిసి నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X