Who Is This Heroine? 1 నిమిషానికి కోటి రూపాయల రెమ్యునరేషన్.. ఆ హీరోయిన్ ఎలా సంపాదిస్తున్నదో తెలుసా?

సినీ తారల తమకు వచ్చే బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ సినిమాల ఆధారంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. తమకు లభించే విజయాల ద్వారా సంపాదన కొనసాగుతుంటుంది. అయితే కొందరు హీరోయిన్ల ఖాతాలో ఎలాంటి హిట్లు లేకపోయినా పాపులారిటీకి కొదవేం ఉండదు. వారి విలాసాలకు, వినోదాలకు, లగ్జరీ కార్లలో తిరిగే అవకాశాల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అనే విధంగా ఉంటారు. అలాంటి హీరోయిన్లలో ఊర్వశి రౌటేలా ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఆమె ప్రస్తుతం కళ్లు తిరిగే సంపాదనతో అందర్నీ ఆకట్టుకొంటున్నారు. ఊర్వశి రౌటేలా సంపాదన వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా పరిశ్రమలో ఊర్వశి రౌటేలాకు మంచి డిమాండ్ ఉంది. ఫుల్త్ లెంగ్త్ పాత్రలకు కాకుండా స్పెషల్ సాంగ్స్‌లో ఐటమ్ గర్ల్‌గా ప్రేక్షకులను రంజింపజేస్తున్నది. ఆమె నర్తించిన పాటలు, వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఆదరణ కురిపించడమే కాకుండా ఆ సినిమాలు భారీ విజయాలను అందుకొంటున్నాయి. దాంతో ఇటీవల కాలంలో ఊర్వశిని టార్గెట్ చేసి స్పెషల్ సాంగ్స్ డిజైన్ చేస్తున్నారు.

Is Urvashi Rautela Charging 1 Crore Remunerations for 1 minute performance in Telugu Movies?

ఇటీవల కాలంలో ఊర్వశి రౌటేలా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, అలాగే బోయపాటి శ్రీను రూపొందించిన స్కంధ సినిమాలో హీరో రామ్ పోతినేనితో ఓ పాట, అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో బ్రో సినిమాలో ఐటెమ్ గర్ల్‌గా తన గ్లామర్ ప్రదర్శనతో అదరగొట్టింది. అలాగే అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఈ నాలుగు సినిమాల్లో ఊర్వశి రౌటేలా పాటలు మంచి క్లిక్ అయ్యాయి.

ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో రెండు నిమిషాల బాస్ పార్టీ పాటలో నటించినందుకు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే స్కంద మూవీలో మూడు నిమిషాల పాట కోసం బోయపాటి శ్రీను 3 కోట్ల రూపాయలు పారితోషికంగా చెల్లించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆమె ఒక్కో నిమిషానికి 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని ఆమె సన్నిహితులు తెలిపారు.

Is Urvashi Rautela Charging 1 Crore Remunerations for 1 minute performance in Telugu Movies?

ఇదిలా ఉండగా, ఊర్వశి రౌటేలా సంపాదన భారీగానే ఉందనే మీడియా, ట్రేడ్ వర్గాల సమాచారం. ఇటీవల ఆమె ముంబైలో 200 కోట్ల రూపాయలతో ఓ విల్లాను కొనుగోలు చేసిందనే విషయం మీడియాలో ట్రెండ్ అయింది. తాజాగా ఆమె ఓ నిమిషానికి వసూలు చేస్తున్న రెమ్యునరేషన్ చూస్తే ఆమె సంపాదన భారీగానే ఉందనే విషయం అర్దమవుతున్నది.

ఊర్వశి రౌటేలా కెరీర్ విషయానికి వస్తే.. 2023 సంవత్సరంలో వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంధ సినిమాల తర్వాత హిందీలో దిల్ హై గ్రే చిత్రంలో నటిస్తున్నది. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో బ్లాక్ రోజ్ అనే సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ వాయిదాపడుతూ వస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X