Urvashi Rautela ధరించిన నెక్లెస్ ధర 275 కోట్లా? కాన్స్ 2023లో హాట్ టాపిక్‌గా ఊర్వశి రటేలా హంగామా

వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో మరింత చేరువైన ఊర్వశీ రటేలా కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సత్తా చాటుతున్నది. 76వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌‌లో తన అందాల విందుతో అంతర్జాతీయ మీడియాను ఆకట్టుకొనే ప్రయత్నంలో పడింది. కాన్స్ 2023 లో ఊర్వశీ రటేలా ధరించిన నగలు, దుస్తులు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఆమె ధరించిన జ్యువెల్లరీ విలువ కోట్ల రూపాయల్లో ఉండటం ఇప్పుడు అందరిలోను చర్చగా మారింది. ఊర్వశీ రటేలా గ్లామర్ ట్రీట్ విషయంలోకి వెళితే..

ఖరీదైన నగలు.. విలువైన దుస్తులు:కాన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై సినీ తారలు విచిత్ర వేషాధారణతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటే.. ఊర్వశి రటేలా విలువైన నగలు, ఖరీదైన దుస్తుల గురించి మీడియా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నది. ఎవరి ఊహకు అందకుండా ఊర్వశీ తనదైన శైలిలో కాన్స్ రెడ్ కార్పెట్‌పై అందచందాలను ప్రదర్శిస్తున్నది.

Is Urvashi Rautelas crocodile neckless cost 275 crores which wore in Cannes 2023?

ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ విజేతతో :కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఊర్వశీ రటేలా ప్రపంచ సినీ తారలతో మమేకమైంది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సొంతం చేసుకొన్న జూలియన్ మోర్‌తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సందర్భంగా ఊర్వశి రటేలాపై జూలియన్ మోర్ ప్రశంసలు కురిపించింది. ఆమె అందాన్ని కొనియాడుతూ.. ఊర్వశీ స్టన్నింగ్ పర్సనాలిటీ, ప్రపంచంలోనే అందమైన, సక్సెస్ ఫుల్ హీరోయిన్ అని ప్రశంసించడం విశేషంగా మారింది.

Is Urvashi Rautelas crocodile neckless cost 275 crores which wore in Cannes 2023?

మైసన్ వాలెంటినో బ్యాగ్ ఖరీదు:జూలియన్ మోర్‌ను కలిసిన సందర్భంగా ఛానెల్ బ్రాండ్ జ్యువెల్లరీని వేసుకొని అందరి చూపును తిప్పుకొన్నది. ఆమె ఉపయోగించిన మైసన్ వాలెంటినో బ్యాగ్ ఖరీదు ఏకంగా 30 లక్షల రూపాయలు అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె అనుసరిస్తున్న ఫ్యాషన్ ట్రెండ్స్‌పై నెటిజన్లు ఫిదా అవుతుండటం గమనార్హం.

Is Urvashi Rautelas crocodile neckless cost 275 crores which wore in Cannes 2023?

హాట్ టాపిక్‌గా క్రోకడైల్ జ్యువెల్లరీ:ఊర్వశీ రటేలా ధరించిన కార్టియర్ క్రోకడైల్ జ్యువెల్లరీ అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా మీడియాలోను, సోషల్ మీడియాలోను హాట్ టాపిక్‌గా మారింది. ఈ జ్యువెల్లరీని సైమా కోట్యూర్ డిజైన్ చేయడం గమనార్హం. కార్టియర్ క్రోకడైల్ జ్యువెల్లరీ విలువ 200 కోట్ల నుంచి 275 కోట్ల మేర ఉంటుందని మీడియా అంచనా వేసింది. అంత ఖరీదైన నగలతో ఊర్వశీ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది.

Is Urvashi Rautelas crocodile neckless cost 275 crores which wore in Cannes 2023?

పర్వీన్ బాబీ బయోపిక్‌లో:ఊర్వశీ రటేలా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో తనదైన శైలిలో వెండితెర మీద రాణిస్తున్నది. చిరంజీవితో బాస్ పార్టీ తర్వాత తెలుగులో స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న బాలీవుడ్ నటి పర్వీన్ బాబీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో టైటిల్ రోల్ పోషిస్తున్నది. త్వరలోనే పర్విన్ బాబీ బయోపిక్ వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X