For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యువ పొలిటీషియన్‌తో డేటింగ్.. నుస్రత్ జహాన్ మ్యారేజ్ బ్రేకప్ వెనుక కారణం అదే... భర్త దారుణంగా...

  |

  బెంగాల్ హీరోయిన్, యువ ఎంపీ నుస్రత్ జహాన్ దాంపత్య జీవితం మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది. రెండేళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకొన్న నుస్రత్ ఇటీవల భర్త నిఖిల్ జైన్‌ నుంచి విడిపోయారు. అయితే ప్రస్తుతం ఆమె వివాహానికి సంబంధించిన చట్టబద్దత ఇప్పుడు వివాదంగాను, మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు ప్రేమించి పెళ్లి చేసుకొన్న నిఖిల్ జైన్‌ను విడిచిపెట్టడానికి అసలు కారణాలు ఏమిటంటే...

  టర్కీ వివాహ చట్టం ప్రకారం పెళ్లి

  టర్కీ వివాహ చట్టం ప్రకారం పెళ్లి

  బెంగాల్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించడమే కాకుండా బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఎన్నికైన కొద్ది రోజులకే ఆమె పారిశ్రామిక వేత్త నిఖిల్ జైన్‌ను టర్కీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ పద్దతిలో వివాహం చేసుకొన్నారు. టర్కీ వైవాహిక చట్టం ప్రకారం నుస్రత్ జైన్ పెళ్లి చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

  నటుడు, పొలిటిషియన్ యష్ దాస్ గుప్తాతో డేటింగ్

  నటుడు, పొలిటిషియన్ యష్ దాస్ గుప్తాతో డేటింగ్

  అయితే నుస్రత్ జహాన్‌తో వివాహం తర్వాత బెంగాల్ రాజకీయ వేత్త, నటుడు యష్ దాస్ గుప్తాతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే నుస్రత్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని యష్ దాస్ పరోక్షంగా అంగీకరించాడు. అయితే ఈ రూమర్లపై నుస్రత్ మాత్రం ఎలాంటి ప్రకటన గానీ, వివరణ గానీ ఇవ్వకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

  భర్త నుంచి విడిపోయిన నుస్రత్

  భర్త నుంచి విడిపోయిన నుస్రత్

  యష్ దాస్ గుప్తాతో డేటింగ్ రూమర్లు వచ్చిన సమయంలో నుస్రత్ జహాన్ వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడిందనే వార్తలు వచ్చాయి. అందరూ ఊహించినట్టుగానే వారిద్దరి నవంబర్ 2020లో విడిపోయారు. అయితే తనను చీట్ చేశాడని, తన డబ్బును దుర్వినియోగం చేశాడని నిఖిల్ జైన్‌పై నుస్రత్ జహాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాను సంపన్న వర్గానికి చెందిన వాడనని నన్ను మోసగించాడు అని ఆవేదన వ్యక్తం చేశారు.

  అక్రమంగా డబ్బు ట్రాన్స్‌ఫర్

  అక్రమంగా డబ్బు ట్రాన్స్‌ఫర్

  భర్త నిఖిల్ జైన్‌పై నుస్రత్ జహాన్ తీవ్ర విమర్శలు చేస్తూ.. నా బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా డబ్బు విత్ డ్రా చేసేవాడు. నా ప్రమేయం, అనుమతి లేకుండా రాత్రి పూట నా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకొన్నాడు. మేము విడిపోయిన తర్వాత కూడా నిఖిల్ డబ్బులు విత్ డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి అని నుస్రత్ జహాన్ పేర్కొన్నారు.

   నగలు, ఆభరణాలు అక్రమంగా

  నగలు, ఆభరణాలు అక్రమంగా

  భర్త నిఖిల్ జైన్‌పైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా నుస్రత్ జహాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా డబ్బు డ్రా చేసినందుకు బ్యాంక్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాను. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడను. అంతేకాకుండా నిఖిల్ కుటుంబ సభ్యులు నా ఆస్తులను కబ్జా చేశారు. పెళ్లి సమయంలో నా తల్లిదండ్రులు ఇచ్చిన నగలు, అభరణాలు అక్రమంగా స్వాధీనం చేసుకొన్నారు అని నుస్రత్ జహాన్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల వెల్లడించారు.

  ఎవరీ యష్ దాస్‌గుప్తా?

  ఎవరీ యష్ దాస్‌గుప్తా?

  హిందీ టెలివిజన్ రంగంలో బందిని అనే సీరియల్‌లో దాస్ గుప్తా తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నా ఆనా ఇస్ దేశ్ లాడో, అదాలత్ లాంటి సీరియల్స్‌లో నటించాడు. ఆ తర్వాత బెంగాలీ సినీ పరిశ్రమలోకి ప్రవేశించి.. గ్యాంగ్‌స్టర్, వన్, టోటల్ దాదాగిరీ, ఫిదా, మోన్ జానే నా, ఎస్ఓఎస్ కోల్‌కతా చిత్రంలో నటించాడు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ పాలన, విధానాలకు ఆకర్షితుడై బీజేపీలో చేరారు.

  English summary
  Actress Nusrat Jahan And Nikhil Jain Separation become hot topic in political, film and legal sections. Reports suggest that, Actor turned politician Yash Das Gupta is the reason for the Nusrat Jahan's separaton.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X