లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా పెళ్లి.. నిజం బయటపెట్టిన యషికా ఆనంద్
వర్థమాన నటి, బిగ్‌బాస్ ఫేం యషికా ఆనంద్ విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న యషికా మంచి ఆఫర్లు తలుపుతట్టుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పెళ్లి వార్తలు గత రెండు రోజులుగా ఒక్కసారిగా మీడియాలో గుప్పుమన్నాయి. ఈ క్రమంలో యషికా స్పందిస్తూ..

బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్
బిగ్‌బాస్ తమిళ రియాలిటీ షోతో మంచి ప్రేక్షకాదరణను, అభిమానులను కూడగట్టుకొన్న యషికా ఆనంద్ ఇటీవల ప్రేమలో పడినట్టు కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. ఓ బిజినెస్‌మెన్‌తో డేటింగ్ చేస్తున్నారనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆమె పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి.

యషికా ఆనంద్ పెళ్లి అంటూ రూమర్లు
ఇలాంటి వార్తల నేపథ్యంలో లాక్‌డౌన్ సమయంలో యషికా ఆనంద్ పెళ్లి చేసుకొన్నారనే వార్త జోరందుకొన్నది. ఆ వార్తకు తగినట్టుగానే సంప్రదాయమైన సిల్క్ చీరలో, నుదుట బొట్టు పెట్టుకొని వివాహితగా మారినట్టు ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దాంతో సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకొన్నారనే వార్తలకు బలం చేకూరింది.

పెళ్లి కాదు.. యాడ్ షూట్
మీడియాలో తన పెళ్లి వార్త వైరల్ కావడంతో దానికి తెర దించేందుకు యషికా రంగంలోకి దిగింది. తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా క్లారిఫై ఇస్తూ.. నాకు పెళ్లి కాలేదు. పెళ్లి సంబంధిత యాడ్ షూట్ కోసం తీసిన ఫోటోలు. వాటిని చూసి మీరు పొరపాటుకు గురై ఉంటారు అని యషికా ఆనంద్ తన పెళ్లి వార్తపై క్లారిటీ ఇచ్చారు.
Recommended Video

యషికా కెరీర్ కెరీర్ ఇలా
యషికా ఆనంద్ కెరీర్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. అయితే కవలై వెండమ్ అనే చిత్రం ద్వారా యషికా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మునియార్ కుటుంబం, జోంబి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇవాన్ తాన్ ఉతమన్, రాజా భీమ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











