Cannes 2023 శృంగార దేవతను తలదన్నేలా ఇషా గుప్తా.. కేన్స్‌లో అందాల ఆరబోతకు ఫిదా!
ప్రపంచ సినిమాకు అద్బుతమైన వేదికగా మారే కాన్స్ ఫిలింఫెస్టివల్ 2023 అంగరంగ వైభవంగా మారింది. ఈ వేదికపై విశ్వ సినీ పరిశ్రమలో తళుకుబెళుకులతో రాణిస్తున్న సుందరాంగులందరూ హొయలు ఒలికిస్తున్నారు. శృంగార విన్యాసాలు, కళ్లు మిరుమిట్లు కొలిపే విధంగా దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పై కన్నుల పండువగా మారుతున్నారు. కేవలం అందాల ఆరబోతకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆలొచింప జేసే సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వేదికపై ఇండియన్ హీరోయిన్ ఇషా గుప్తా చేసిన సందడి వివరాల్లోకి వెళితే..
కేన్స్‌లో మెరుపులు మెరిపించిన ఇషా గుప్తా: కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారత దేశం తరపున అధికారికంగా ప్రాతినిథ్యం వహిస్తున్న తారల్లో ఇషా గుప్తా ఒకరు. ఇండియన్ సినిమాలో పెద్దగా రాణించలేని ఈ భామ ప్రస్తుతం అంతర్జాతీయ సినిమా పండుగలో తన టాలెంట్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇషా గుప్తా గ్లామర్ ట్రీట్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

రెడ్ కార్పెట్‌పై అందాల భామ: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 రెడ్ కార్పెట్‌పై ఇషా గుప్తా సంచలనం రేపింది. తన అందాల ప్రదర్శనతో మీడియాను తనవైపుకు తిప్పుకొన్నది. రెడ్ కార్పెట్‌పై ఆమె ధరించిన డ్రస్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆమె హొయలు ఒలికిస్తూ నడిచి వస్తుంటే.. కళ్లార్పకుండా చూశారనే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
థైస్ అందాలతో గ్లామర్ ట్రీట్ : ఇషా గుప్తా ధరించిన ఫ్యాన్సీ డ్రస్ ఇప్పుడు సోషల్ మీడియాలోని అన్ని ఫ్లాట్‌ఫామ్‌లో ప్రత్యేకంగా వైరల్ అయింది. లేత గులాబీ రంగు కలర్ దుస్తులను ధరించిన ఆమె.. ఒకవైపు థైస్‌ను పూర్తిగా చూపిస్తూ.. మరో పక్క ఎద అందాలను బహిర్గతం చేస్తూ రెడ్ కార్పెట్‌పై నడిచి వస్తుంటే.. కెమెరాలన్నీ క్లిక్ మనిపించాయి.
లెబనాన్ డిజైనర్ సృష్టించిన హంగామా: ఇషా గుప్తాను శృంగార దేవతగా మార్చిన ఘనత లెబనాన్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ నికోలాస్ జెబ్రాన్‌కే దక్కుతుంది. దాదాపు నడుము వరకు కట్ చేసి ఉన్న థైస్ స్లిట్ గౌన్, ఒక కాలు తొడ క్లీన్‌గా కనిపించే విధంగా, అలాగే క్లీవేజ్ షోకు అనుకూలంగా ఉండే విధంగా గౌన్‌ను డిజైన్ చేశారు. ఆమె ధరించిన చెవి రింగులు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

ఇంతటి అందం ఎవరికైనా: ఇషా గుప్తా అందాలతో మతిపోయిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇషాను తలదన్నె అందం ఎవరికైనా ఉందా? ఆమె గ్లామర్‌తో ఎవరైనా పోటీ పడే వారు ఉన్నారా? కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలి రోజే ఇషా గుప్తా రెడ్ కార్పెట్‌పై అందాల ప్రకంపనలను సృష్టించింది. ఇషా గుప్తా తన గ్లామర్‌తో మెరుపులు మెరిపించింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











