ఆ స్టార్ హీరో గదికి రమ్మన్నాడు.. నిర్మాతకి కాల్ చేస్తే అలా.. నిజాలు బయట పెట్టిన హీరోయిన్!

లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లో సాధారణం అయిపోయాయి. కానీ సినీ రంగంలో లైంగిక వేధింపులు మీద మాత్రం ప్రజలందరూ ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. సినీరంగం గ్లామర్ ఫీల్డ్ కావడంతో ఈ లైంగిక వ్యవహారాల మీద ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది కానీ సినిమా రంగమే చెడిపోయింది అన్నట్టు కొందరు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ మధ్య మొదలైన మీటూ అనే ఉద్యమం తర్వాత సినీ పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపులు మీద చాలా మంది నోరు విప్పారు. తాజాగా నాగార్జునతో కలిసి ఒక సినిమాలో నటించిన ఇషా కొప్పికర్ కూడా తాను ఈ వేధింపుల బారిన పడిన విషయాన్ని వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే

చంద్రలేఖ సినిమాలో

చంద్రలేఖ సినిమాలో

బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించిన ఇషా కొప్పికర్ అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంది. నిజానికి 98లో చంద్రలేఖ అనే సినిమాలో ఆమె రమ్యకృష్ణ సోదరి పాత్రలో నటించి అందరిని మెప్పించింది. అయితే తెలుగులో కంటే ఎక్కువగా హిందీలోనే ఆమె సినిమాలు చేసింది అని చెప్పాలి. తెలుగులో కేవలం ఆమె మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా అనే సినిమాలలో నటించిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమె 2017 వ సంవత్సరం లో నిఖిల్ హీరోగా వచ్చిన కేశవ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది.

మోడలింగ్

మోడలింగ్

అయితే తన కెరీర్ అనుకున్నంత బాగా సాగకపోవడానికి కారణం లైంగిక వేధింపులు అనే విషయాన్ని తాజాగా వెల్లడించింది. తమ కుటుంబంలో వాళ్ళందరూ ఎక్కువగా డాక్టర్ లేనని, కానీ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో పాకెట్ మనీ సంపాదించడం కోసం మోడలింగ్ చేయడం మొదలు పెట్టానని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

మోడలింగ్

మోడలింగ్

అలా మోడలింగ్ నుంచి సినిమా అవకాశాలు రావడంతో అవి కూడా చేయడం మొదలుపెట్టాను కానీ 2000 సంవత్సరంలో ఒక నిర్మాత నుంచి తనకు కాల్ వచ్చిందని ఆమె వెల్లడించారు. అప్పుడే కెరీర్ మొదలు పెట్టిన తనకు ఆ నిర్మాత నుంచి కాల్ రావడం అనేది చాలా గొప్ప విషయం అని అయితే కాల్ చేసిన నిర్మాత మేము చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా అనుకుంటున్నాము, మా హీరోకు కూడా మీరు బాగా నచ్చారు ఆయన ఒంటరిగా కలవమని చెప్పారని చెప్పారు.

లెంట్ ఉంది

లెంట్ ఉంది

అయితే ఆ సమయంలో తనకు నిర్మాత చెప్పిన మాటలు అర్థం కాలేదని వెంటనే హీరో కి కాల్ చేసి విషయం చెబితే అవును మీరు ఒంటరిగా రావాల్సి ఉంటుంది మీ స్టాఫ్ కూడా మీ వెనకాల రాకూడదు అని చెప్పడంతో వారు చెబుతున్న ఉద్దేశం ఏమిటో తనకు అర్థమైందని ఆమె చెప్పుకొచ్చింది. వెంటనే నిర్మాతకు ఫోన్ చేసి నేను నా టాలెంట్ ఆధారంగానే నిలబడతామని ఈ రంగంలోకి వచ్చాను. నేను అందంగా ఉంటాను, టాలెంట్ ఉంది నా ప్రతిభను ఆధారంగా చేసుకుని పని ఇవ్వగలిగితే ఇవ్వండి కానీ వేరే ఫెవర్స్ ఏమీ ఆశించవద్దు అని ఖరాఖండిగా చెప్పారు అని చెప్పుకొచ్చింది.

Recommended Video

Flashback 2018 : Top 10 Celebrity Weddings In 2018 | Filmibeat Telugu
 సిద్ధం అవ్వలేదు అని

సిద్ధం అవ్వలేదు అని

అయితే ఆ కారణంతో తన సినిమా నుంచి తప్పించారు అని ఆమె వెల్లడించింది.. తన కెరీర్ లో ఎప్పుడూ రాజీ పడలేదని పేర్కొన్న ఆమె దాని కారణంగా లీడ్ రోల్స్ కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేయాల్సి వచ్చిందని చిన్న చిన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడ్డా, కానీ ఎవరితోనూ ఏ పరిస్థితులలోనూ రాజీ పడటానికి తాను సిద్ధం అవ్వలేదు అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X