Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వరుసగా మూడు... శరీరం నొప్పిగా ఉన్నా మనసు సంతోషంగా ఉంది: శ్రద్ధా కపూర్
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఈ ఏడాది ఎన్నడూ లేనంత బిజీగా గడుపుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కష్టపడుతోంది. ఒకేసారి సాహో, చిచ్చోరే, స్ట్రీట్ డాన్సర్ చిత్రాలు చేస్తూ శారీరకంగా చాలా స్ట్రగుల్ అవుతోంది. అయితే ఇది కాస్త కష్టమే అయినా... మూడు పెద్ద సినిమాల్లో భాగం కావడం మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అంటోంది ఈ ముంబై బ్యూటీ.
'విశ్రాంతి లేకుండా మూడు సినిమాల్లో నటించడం వల్ల నా శరీరం చాలా అలిసిపోతోంది. కొన్నిసార్లు తీవ్రమైన బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం నాకు శారీరకంగా కఠినమైన సంవత్సరం. ఈ ఏడాది మూడు సినిమాల్లో నటిస్తున్నాను. అయితే స్ట్రీట్ డాన్సర్ వచ్చే ఏడాది రిలీజ్ అవుతోంది. ఇపుడు నేను తప్పకుండా బ్రేక్ తీసుకోవాల్సిన సమయం. కానీ ఇదే సమయంలో 'సాహో' ప్రమోషన్స్ మొదలయ్యాయి.'' అని శ్రద్ధా కపూర్ సాహో ట్రైలర్ లాంచింగ్ ఈవెంటులో వెల్లడించారు.
వరుస రిలీజెస్
‘సాహో' ఆగస్టు 30న విడుదలవుతుండగా... ‘చిచ్చోరే' సెప్టెంబర్ 6వ తేదీన విడుదల కాబోతోంది. స్ట్రీట్ డాన్సర్ మూవీ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌తో పాటు వరుణ్ ధావన్ నటిస్తున్నాడు.
రెండు సినిమాలు భిన్నమైనవి
ఈ ఏడాది విడుదల కాబోతున్న రెండు సినిమాల గురించి శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ...‘ఈ రెండు చిత్రాలు విభిన్నమైనవి. ఇవి రెండు కూడా చాలా తక్కువ గ్యాపుతో థియేటర్లలోకి వస్తుండటం లక్కీగా ఫీలవుతున్నాను.' అని శ్రద్ధా కపూర్ తెలిపారు.
స్క్రీప్టు డిమాండ్ చేసింది కాబట్టే
సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో'లో శ్రద్ధా కపూర్ కపూర్ యాక్షన్ సీన్లు కూడా చేశారు. ‘స్క్రిప్టు డిమాండ్ చేసింది కాబట్టే నేను కూడా యాక్షన్ సీన్లు చేయాల్సి వచ్చింది. ఈ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని భావిస్తున్నాను' అని శ్రద్ధా వ్యాఖ్యానించారు.
ప్రభాస్, శ్రద్ధా కపూర్
‘సాహో' మూవీ ద్వారా శ్రద్ధా కపూర్ తొలిసారిగా ప్రభాస్‌తో కలిసి నటిస్తున్నారు. ‘ప్రభాస్ పెద్ద సూపర్ స్టార్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి.. అతడితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లో షూటింగ్ జరిగినపుడు అందరూ నన్నుఎంతో బాగా చూసుకున్నారు' అని శ్రద్ధా చెప్పుకొచ్చారు.