కరోనా దెబ్బకు మరో పెద్ద సినిమా వాయిదా
సినిమా ఇండస్ట్రీని మరోసారి కరోనా మహమ్మారి భయానికి గురి చేస్తోంది. కొత్త ఏడాది కొత్త సినిమాలతో హడావుడి మొదలైందని అనుకుంటే ఆ ముచ్చట మూడు నెలలకే పరిమితమైంది. ఒక సినిమా తరువాత మరొక సినిమా వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో శేఖర్ కమ్ముక లవ్ స్టొరీ విడుదల తేదీని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.
సిమ్రత్ కౌర్ రొమాంటిక్ ఫోటోలు.. డర్టీ హరిని మించిన ఎక్స్‌పోజింగ్
ఇక బాలీవుడ్ బిగ్ బడ్జెట్ బయోపిక్ తలైవి కూడా వాయిదా పడినట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. సినీనటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా తెరకెకెక్కిన ఆ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇక ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు.

అందుకోసం అన్ని భాషల్లో ప్రమోషన్ డోస్ కూడా పెంచుతూ వచ్చారు. కేవలం హిందీలోనే కాకుండా తమిళ్ తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఏప్రిల్ 24న సినిమా థియేటర్స్ లోకి రానున్నట్లు ప్రచారాలు జోరుగా కొనసాగుతున్న క్రమంలో సడన్ గా చిత్ర యూనిట్ వాయిదా వేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. కోవిడ్ కారణంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని వీలైనంత వరకు పరిస్థితులు అనుకూలించిన తరువాతే సినిమాను రిలీజ్ చేస్తామని వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











