నువ్వు ఎవడివివరా? నీ బట్టలిప్తేస్తాను.. దొబ్బేయ్.. నోటికి పనిచెప్పిన అనసూయ
టాప్ యాంకర్, యాక్టర్ అనసూయకు సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తానేదో హ్యాపీ మూడ్‌లో లైవ్‌లోకి వస్తే.. నెటిజన్లు వేసే అడ్డదిడ్డమైన ప్రశ్నలకు చిరాకు పడిపోవడం, వారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం లాంటివి చేస్తుంటారు. దాంతో ఆమె యూట్యూబ్, వెబ్ మీడియాలో హెడ్‌లైన్‌గా మారుతుంటారు. ఇలాంటి పరిస్థితి అనసూయకు బర్త్ డే రోజున కూడా తప్పలేదు. ఇంతకు ఏం జరిగిందంటే..
Recommended Video

మే 15న బర్త్ డే విషెస్
యాంకర్ అనసూయ మే 15వ తేదీన తన జన్మదినాన్ని జరుపుకొన్నారు. డిజైనర్ దుస్తులు ధరించి గ్లామరస్‌గా కనిపించారు. మొబైల్‌లో ఇన్స్‌టాగ్రామ్ ద్వారా లైవ్ చాటింగ్ చేశారు. అభిమానులను పేరు పేరునా పిలుస్తూ వారికి విష్ చేశారు. అభిమానులు అందించిన జన్మదిన శుభాకాంక్షలను ఆస్వాదించారు. ఇలా లైవ్‌లో మంచి జోష్‌ను ప్రదర్శించారు. బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేశారు. జానీ మాస్టర్‌కు కంగ్రాట్స్ చెప్పారు.

హుషారుగా.. గలగలా మాట్లాడేస్తూ...
జన్మదినం రోజున లైవ్‌లో అభిమానులతో ఆనందంగా ముచ్చటిస్తూ హుషారుగా కనిపించారు. అందరికీ హాయ్ చెబుతూ గలగలా మాట్లేడిసింది. అభిమానులు కోరితే పాట కూడా పాడింది. నీవేనా నీవేనా అంటూ పాట పాడుతుండగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఓ రేంజ్‌లో ఇరిటేట్ అయింది. ఇలాంటి వాళ్లను చూస్తే వాడు.. వీడు. లాంటి పదాలు నోట్లో నుంచి వస్తాయి. అయినా ఇలాంటోళ్లను వదిలేయొద్దు అంటూ అనసూయ ఫైర్ అయ్యారు.

నువ్వెవ్వరు అంటూ నోటికి పనిచెప్పిన యాంకర్
అనసూయను ఉద్దేశించి ఓ నెటిజన్ డ్రస్సు మంచిగా వేసుకొ.. ఇద్దరు పిల్లలకు తల్లివనే విషయాన్ని మరిచిపోకు అనగానే కోపంతో ఊగిపోయింది. నువ్వెవరు? నువ్వు ఎవడివిరా? నా బర్త్ డే రోజున నా చేతి తిట్లు తినాలనుకొంటున్నావు? చూడటానికి నైస్‌గా, క్యూట్‌గా ఉంది.. ఏమనదనుకొంటున్నావా? నీ కోసం ఈ రోజు నీ బట్టలిప్పేస్తాను అంటూ అనసూయ మండిపడ్డారు.

అమ్మతనం గురించి తెలుసా?
నీకు అమ్మతనం గురించి తెలుసా? నీవు అమ్మవా? నీ లైఫ్‌లో నీ బతుకుకి ఎప్పుడైనా అమ్మవు అవుతావా? అమ్మతనం గురించి అర్హత ఉందా? అమ్మగా ఎలా ఉండాలో నువు చెబుతావా? అమ్మ ఎలాంటి డ్రస్సు వేసుకోవాలి? ఎలా ఉండాలని నిర్ణయించడానికి నీవు ఎవడివి? ఓ అమ్మకు ఎలా ఉండాలనేది ఆమెకు సంబంధించిన విషయం అని అనసూయ క్లాస్ పీకారు.

అమ్మ అంటే.. మరొకరికి లైఫ్ ఇస్తూ
అమ్మ అంటే తనకు తాను లైఫ్‌ను కొనసాగిస్తూ.. మరోకరికి లైఫ్ ఇస్తుంది. చక్కగా.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు బతకాలనుకొంటే నీవెవడివివరా చెప్పడానికి. నేను అందంగా ఉంటాను, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. అమ్మ అయితే ఇలా బట్టలు ఇలా వేసుకోవాలి.. అలా వేసుకోవాలి అనే చెప్పడానికి.. నీకు నచ్చకపోతే దొబ్బేయ్ అంటూ అనసూయ వీరంగాన్ని ప్రదర్శించారు.

తప్పదు ఇలాంటోళ్లను
సొసైటీలో అందరూ మంచి వాళ్లే ఉండాలని కోరుకోవడం తప్పు. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు. ఇలా తిక్కతిక్కగా మాట్లాడే వాళ్లను కొన్నిసార్లు భరించాల్సి వస్తుంది. కొందరు మగాళ్లు మహిళలను డిక్టేట్ చేయాలని చూస్తారు. అలాంటి వాళ్లను పెద్దగా పట్టించుకోవద్దు అంటూ అనసూయ తనను తాను సముదాయించుకొన్నారు. మళ్లీ జోష్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటిస్తూ హ్యాపీగా గడిపారు.


Click it and Unblock the Notifications











