పుష్పలో రోల్ గురించి అనసూయ లీక్.. రంగస్థలం కంటే అంతకుమించి అంటూ

బుల్లితెర మీదే కాకుండా వెండితెర మీద కూడా అద్భుతంగా రాణిస్తున్న ఆర్టిస్టుల్లో అనసూయ భరద్వాజ్ ఒకరు. గ్లామర్ పండిస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. ఆమె టాలెంట్‌కు ఇటీవల వచ్చిన చిత్రాలు సాక్షంగా నిలిచాయి. తాజాగా అనసూయ తాను నటిస్తున్న పుష్ప గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకొన్నారు. ఆమె కెరీర్, తాజా సినిమా వివరాల్లోకి వెళితే...

స్టైలిష్ లుక్ తో కవ్విస్తున్న లేటెస్ట్ మహేశ్వరి

 రంగస్థలం మూవీతో అనసూయ గ్రాఫ్

రంగస్థలం మూవీతో అనసూయ గ్రాఫ్

అప్పటి వరకు గ్లామర్ తారగానే పేరు తెచ్చుకొన్న అనసూయ కెరీర్ ఒక్కసారిగా రంగస్థలం సినిమాతో మారిపోయింది. రంగస్థలం సినిమా రంగమ్మత్తగా ఆమె నటన మరో రేంజ్‌లో ఉందంటూ ప్రేక్షకులు కితాబు ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను వెతుక్కొంటూ మంచి పాత్రలు వస్తున్నాయి.

 పుష్పలో కీలక పాత్రతో మరోసారి

పుష్పలో కీలక పాత్రతో మరోసారి

ఇటీవల చావు కబురు చల్లగా సినిమాలో స్పెషల్ సాంగ్‌తో దుమ్ము దులిపిన అనసూయ మరోసారి నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రంలో నటించడానికి సిద్ధమైంది. మళ్లీ సుకుమార్ దర్వకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. పుష్పలో తన పాత్ర గురించి చెబుతూ థ్రిల్ అయిపోయారు.

మళ్లీ పవర్ ప్యాక్ట్ రోల్‌‌తో

మళ్లీ పవర్ ప్యాక్ట్ రోల్‌‌తో

పుష్ప సినిమాలో నా రోల్ అద్భుతంగా ఉందంటూ చెబుతూనే.. పూర్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. అయితే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ప్యాక్ట్ రోల్ అంటూ హింట్ ఇచ్చారు. కానీ పూర్తి వివరాలు అడగకూడదు అంటూ అనసూయ సస్పెన్స్ కొనసాగించారు.

ఫుల్ ఇంపాక్ట్ ఉన్న రోల్‌లో

ఫుల్ ఇంపాక్ట్ ఉన్న రోల్‌లో

రంగస్థలం సినిమాలో కథపై ప్రభావం పడే పాత్రలో నటించాను. అందుకు సుకుమార్‌గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రంలో అంతే ఇంపాక్ట్ ఉన్న పాత్రలో కనిపిస్తాను. అందుకు మరోసారి దర్శకుడికి నా థ్యాంక్స్ అంటూ ముగించారు.

Recommended Video

#VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
కోలుకొంటున్న అల్లు అర్జున్

కోలుకొంటున్న అల్లు అర్జున్

ఇక పుష్ప షూటింగ్ కొద్ది రోజుల వరకు శరవేగంగా కొనసాగింది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, అనసూయపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే అల్లు అర్జున్‌కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో షూటింగును నిలిపివేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ వేగంగా కోలుకొంటున్నారు. త్వరలోనే ఈ షూటింగును మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది అని యూనిట్ వర్గాలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X