Anasuya Bharadwaj: జీవితంలో ఆ ఒక్క కోరిక మిగిలిపోయిందంటున్న అనసూయ.. ఏంటో తెలుసా?

తెలుగు వారెవరికి యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ... ప్రస్తుతానికి యాంకరింగ్ మానేసి పూర్తిగా నటన మీద దృష్టి పెట్టింది. అయితే ఈ భామ ఒక తీరని కోరికతో సతమతమవుతుందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అసలు ఏంటి ఆ కోరిక.. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అనసూయ భరద్వాజ్ చదువుకునే రోజుల్లోనే సొంతం అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత న్యూస్ రీడర్ గా సాక్షి ఛానల్ లో కెరియర్ మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టి యాంకరింగ్ చేస్తూ వచ్చింది. ఆ జబర్దస్త్ షో క్లిక్ అవడంతో ఆమెకు దశతిరిగి పోయిందని చెప్పాలి.

Jabardasth Anchor Anasuya Bharadwaj desire Viral in Social Media

ఆ షో ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగా ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. దీంతో అప్పుడప్పుడు సినిమా అవకాశాలు కూడా అందుకుంటూ సినిమాలు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా రంగస్థలం సినిమా ఆమె కెరీర్ కి మంచి ప్లేస్ అయింది. తర్వాత పుష్ప సినిమాతో కూడా క్రేజ్ అందుకున్న అనసూయ పూర్తిస్థాయిలో నటన మీదే దృష్టి పెట్టాలని భావించి జబర్దస్త్ కార్యక్రమానికి కూడా గుడ్ బై చెప్పింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నటన మీద దృష్టి పెడుతున్న ఈ భామ కొన్ని విషయాల మీద స్పందించే విధానం వివాదాలకు కారణమవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఎన్నోసార్లు ట్రోల్స్ కి కూడా అనసూయ గురైంది. అయితే తాజాగా అనసూయ తన పిల్లల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jabardasth Anchor Anasuya Bharadwaj desire Viral in Social Media

అనసూయ తన భర్త భరద్వాజ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే అనసూయకు మాత్రం కూతురు కావాలని ఎప్పటినుంచో కోరిక ఉందట. ఇద్దరు కుమారులు ఉన్న కూతురు లేదు అనే అసంతృప్తి మాత్రం తనని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుందని అనసూయ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ప్రస్తుతం అనసూయ సినిమాల విషయానికి వస్తే ఆమె సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. కేవలం తెలుగు సినిమాలే కాదు మలయాళ, తమిళ సినిమా అవకాశాలు కూడా ఆమెకు వస్తున్నాయి. అయితే పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్న ఈ భామ సినిమాలను కూడా చాలా కేర్ ఫుల్ గా ఎంపిక చేసుకుంటుంది.

Jabardasth Anchor Anasuya Bharadwaj desire Viral in Social Media

పుష్ప 2 సినిమాలో కూడా తన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని దానికి సంబంధించిన షూటింగ్ విషయం కూడా సుకుమార్ చాలా కేర్ ఫుల్ గా చేస్తున్నారని గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో అనసూయ చెప్పుకొచ్చింది. మొత్తం మీద అనసూయ తనకు కూతురు కావాలనే కోరిక వెలుగులోకి రావడం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకి దారితీస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X