Anasuya Bharadwaj పవన్ కల్యాణ్ సినిమాను అందుకే రిజెక్ట్ చేశా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ వార్‌పై అనసూయ క్లారిటీ
యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం నటిగా మరో జోన్‌లోకి ప్రవేశించారు. బరువైన పాత్రలు, భారమైన, ఎమోషనల్ రోల్స్‌తోనే కాకుండా విలనిజాన్ని కూడా తెర మీద పండిస్తున్నారు. రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్ప చిత్రంలో దాక్షయినిగా, విమానం, ప్రేమ విమానం సినిమాల్లో ఎమోషనల్ క్యారెక్టర్లతో తన రేంజ్‌ను పెంచుకొన్నారు. తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ..
నా కెరీర్ ఆరంభంలో నాకు పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఆఫర్ వచ్చింది. అయితే వారు ఇచ్చిన ఆఫర్‌ను నేను రిజెక్ట్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారి తీసింది. పవన్ కల్యాణ్ అభిమానులను నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. నేను అప్పుడే ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. కానీ పవన్ కల్యాణ్‌కు వచ్చిన ఆగ్రహాన్ని నేను తట్టుకోలేకపోయాను. ఒక హీరోకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా? అనే విషయం అప్పుడే తెలిసింది అని అనసూయ భరద్వాజ్ చెప్పారు.

అత్తారింటి దారేది సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం నన్ను అడిగారు. అయితే ఆ సమయంలో నేను ప్రెగ్నెంట్. అయినా చేద్దామని అనుకొన్నాను. కానీ ఆ పాటలో ఇంకా కొంత మంది ఉంటారని చెప్పారు. దాంతో నేను ఆ పాటలో నటించకూడదని అనుకొన్నాను. ఎందుకంటే ఆ సమయంలో ఫోకస్ అంతా నాపై ఉండాలని కోరుకొన్నాను. జబర్దస్త్ చేసే సమయంలో నాపై నాలుగు కెమెరాల ఫోకస్ ఉండేది అని అనసూయ భరద్వాజ్ అన్నారు.
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సినిమా అనగానే కడుపుతో ఉన్నా చేయాలని అనుకొన్నాను. టీమ్ కూడా చీర కట్టుకొని కవర్ చేయవచ్చు అని చెప్పారు. అయితే గుంపులో ఒకరిగా నేను చేయననని చెప్పడంతో ఈ గొడవ మొదలైంది. అయితే అప్పుడు, ఇప్పుడు కూడా నేను ఏదైనా సినిమాలో నటిస్తున్నాననంటే నాపై ఫోకస్ ఉంటేనే చేస్తానని చెబుతాను అని అనసూయ తెలిపారు.

నాపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వార్ ప్రకటించడానికి ముందు నాతో త్రివిక్రమ్ మాట్లాడలేదు. ఆఫర్ కోసం టీమ్ మాట్లాడారు. సోషల్ మీడియాలో ట్రోల్ తర్వాత నాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడాను. నాపై నెగిటివ్‌కు, సినిమాపై తాను చేసిన కామెంట్స్‌కు రియాక్షన్ నా తప్పేమీ లేదని ఆయనకు చెప్పాను. దాంతో నేను క్లారిటీ ఇవ్వడంతో ఆయన కూడా సానుకూలంగా రియాక్ట్ అయ్యారు అని అనసూయ తెలిపారు.
అత్తారింటికి దారేది సినిమా చేసిన తర్వాత ట్విట్టర్‌లో నేను ఒక పోస్టు పెట్టడం సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. సినిమా చూి ఆ గుంపులో నేను ఉండకపోవడమే మంచిందైంది. నేను ఆ సినిమాను వదులుకోవడమే బెటర్ అని పోస్టులో పెట్టాను. అప్పుడు నేను కొంత ముక్కుసూటిగా మాట్లాడేదానిని. నాకు ఎలా మాట్లాడాలో లౌక్యం తెలియదు. ఇప్పుడిప్పుడు కొంత నేర్చుకొంటున్నాను అని అనసూయ ఆ వివాదం గురించి పలు విషయాలు వెల్లడించింది.


Click it and Unblock the Notifications











