అలాంటి పాత్ర చేయడం లేదు.. రూమర్లను ఖండించిన అనసూయ

యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ తనపై వచ్చే రూమర్లపై ఎప్పటికప్పుడూ క్లారిటీ ఇస్తుంటారు. తనపై ఇలాంటి వార్త వచ్చినా వెంటనే సోషల్ మీడియాలో స్పందించి వాటి వివరాలను అందజేస్తుంటారు. తాజాగా ఓ యువ దర్శకుడు, యువ హీరో రూపొందించే సినిమాలో ఓ పాత్రను పోషిస్తున్నారంటూ వచ్చిన వార్తపై తన ట్విట్టర్ అకౌంట్‌లో స్పందించారు. తాను ఆ సినిమా చేయడం లేదంటూ క్లారిటీ ఇస్తూ..

రెండు రోజులుగా అనసూయపై రూమర్లు

రెండు రోజులుగా అనసూయపై రూమర్లు


గత రెండు రోజులుగా గురు పవన్ అనే నూతన దర్శకుడు యువ హీరో సుమంత్ అశ్విన్‌తో రూపొందించే చిత్రంలో సీనియర్ నటి ఇంద్రజను తప్పించి అనసూయతో ఆ పాత్రను చేయిస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్‌లో షూట్ చేయడం తన వల్ల కాదని చెప్పడంతో అనసూయను తీసుకొన్నారనే వార్త మీడియాలో వైరల్ అయింది.

తల్లి పాత్రలో నటిస్తున్నారంటూ

తల్లి పాత్రలో నటిస్తున్నారంటూ

అయితే సుమంత్ అశ్విన్ సినిమాలో అనసూయ ధరించే పాత్ర తల్లి పాత్ర అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ క్రమంలో యువ హీరోకు తల్లిగా హీరో శ్రీకాంత్‌కు భార్యగా నటిస్తున్నట్టు వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొట్టాయి. దాంతో అనసూయ చేయడం ఏమిటనే ప్రశ్నలు వచ్చాయి. ఆ వార్త మీడియాలో వైరల్‌గా మారడంతో అనసూయ నేరుగా మీడియాలో స్పందించారు. తాను అలాంటి పాత్రను చేయడం లేదు. ఆ వార్తలో నిజం లేదని చెప్పారు.

ఆ పాత్రను తిరస్కరించిన అనసూయ

ఆ పాత్రను తిరస్కరించిన అనసూయ


అయితే ఇంద్రజను స్థానంలో తనను తీసుకోవాలనే ప్రపోజల్‌ను అనసూయ తిరస్కరించారట. అలాంటి పాత్రలు చేయలేనని చెప్పి సున్నితంగా ఆ సినిమాను ఒప్పుకోలేదట. సుమంత్ సినిమాలో తాను నటించడం లేదని పరోక్షంగా అనసూయ తెలిపారు. అయితే ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, ప్రియా వడ్లమాని, శ్రీకాంత్, జబర్దస్త్ టీమ్‌లో కొంతమంది కమెడియన్లు నటిస్తున్నారు.

అనసూయ నటిస్తున్న సినిమాలు

అనసూయ నటిస్తున్న సినిమాలు


ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగ మార్తాండ చిత్రంలో అనసూయ నటిస్తున్నారు. ఆ చిత్రంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా మరికొన్ని సినిమాల్లో వచ్చిన ప్రపోజల్స్‌ను ఆచితూచీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే కొన్ని ప్రాజెక్టులను కన్ఫర్మ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అలాగే జబర్దస్త్, ఇతర టెలివిజన్ షోలతో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X