Anasuya Bharadwaj : పొట్టి డ్రెస్‌లో అనసూయ రచ్చ.. ఎలాంటి వర్కౌట్స్ చేస్తుందో తెలుసా? (వీడియో)
జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తన యాంకరింగ్ స్కిల్స్ ను ప్రదర్శించి బుల్లితెర ఆడియోస్ కు ఎంతో దగ్గర అయింది అనసూయ. తన అందం, ఆకట్టుకునే యాంకరింగ్ తో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను కూడా క్రియేట్ చేసుకుంది. టెలివిజన్ రంగంలో యాంకర్ గా ఒక ఊపు ఊపేసింది.
ప్రస్తుతం టీవీ రంగానికి చాలా దూరంగా ఉంటూ.. వెండితెరపై అనసూయ దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళుగా టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో కీలకమైన పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటూ.. నటిగా మంచి పేరు సంపాదించుకుంటుంది. తనకు వచ్చిన అవకాశాలను మాత్రం ఎక్కడా పొరపాటు జరగకుండా సద్వినియోగం చేసుకుంటుంది. నటిగా ఇంకా పేరు తెచ్చుకునేందుకు ఛాలెంజింగ్ రూల్స్ లో నటించేందుకు సిద్ధంగా ఉంది.

ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ మూవీ పుష్ప2 లో దాక్షాయినిగా మాస్ లుక్ లో కనిపించి, ఊర మాస్ పర్ఫామెన్స్ తో థియేటర్లలో విజిల్ వేయించుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా అలరించింది. ఆ పాత్ర తనకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత నుంచి అనసూయ చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని చిత్రాల్లో తన పాత్రకు న్యాయం చేస్తూ వస్తుంది.
ఇలా బుల్లితెరకు దూరమైన అనసూయ వెండితెరపై అలరిస్తూనే వస్తుంది. ఇక మరోవైపు తన అభిమానులకు సోషల్ మీడియా వేదిక ద్వారా ఎప్పటికప్పుడు తన గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను పంచుకుంటోంది. ఇప్పటికే బ్యూటిఫుల్ లుక్స్ లో మెరుస్తూ తన ఫ్యాషన్ సెన్స్ ను నెటిజన్లకు చూపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అనసూయ తన ఫిట్నెస్ విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. నటిగా రాణించడానికి తన ఫిట్నెస్ ఎంతో ముఖ్యమని గ్రహించింది.
అందుకు అనసూయ భరద్వాజ్ ప్రతిరోజు జిమ్ములో గంట పాటు వ్యాయామాలు చేస్తూ ఉంటారు. తరచుగా జిమ్ లో చేసే వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోలను ఫోటోలను తన అభిమానులతో తరచుగా పంచుకుంటూ నే వస్తుంది. అయితే తాజాగా మాత్రం అనసూయ భరద్వాజ్ పొట్టి నిక్కర్లో వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. నేను పై పడుకొని స్టార్ యాంకర్ పలు రకాల వ్యాయామాలు చేస్తూ ఫ్యాట్ కరిగించే పనిలో నిమగ్నమైంది. ఇప్పుడు ఆ వీడియోను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
అనసూయ పంచుకున్న వర్క్ అవుట్ వీడియోను తన అభిమానులతో పాటు నెటిజన్లు కూడా లైక్స్ కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు. మరోవైపు నటిగా ఎదిగేందుకు అనసూయ చేస్తున్న కష్టాన్ని ప్రశంసించారు. ఫిట్నెస్ పై అనసూయ కలిగిస్తున్న ఆసక్తికి ఫిదా అవుతున్నారు. అనసూయ అందం వెనుక మంచి డైట్ తో పాటు వర్కౌట్స్ కూడా ఉన్నాయని అంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అనసూయ రీసెంట్ గా పుష్ప2 చిత్రం తర్వాత, రజాకర్ చిత్రంలో మెరిసింది. మునుముందు మరిన్ని ప్రాజెక్టులతో అలరించేందుకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











