Anasuya Bharadwaj నాకు లైన్ వేస్తున్నాడని.. పాపం ఆ హీరోను దూరం పెట్టా.. అనసూయ

వినోద పరిశ్రమలో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన అనసూయ భరద్వాజ్ కొద్దికాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. గ్లామర్ పాత్రలనే కాకుండా డీ గ్లామర్ రోల్స్‌ కూడా చేస్తూ అభిమానులను, సినీ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో జరిగిన విషయాలను పంచుకొన్నారు. అనసూయ చెప్పిన విషయాల్లోకి వెళితే..

క్షణం సినిమాలో మంచి పాత్రతో ఆకట్టుకొన్న అనసూయకు స్పెషల్ సాంగ్స్‌తో గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్నది. రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్పలో మంచి పవర్‌ఫుల్ రోల్‌తో, అలాగే విమానం, ప్రేమ విమానం సినిమాల్లో గుండెను పిండేసే పాత్రలతో ఆకట్టుకొన్నారు. నటిగా ఆమె మంచి పేరు మాత్రమే కాకుండా బిజీగా మారిపోయారు. అలాంటి అనసూయ తన మొదటి సినిమా క్షణం గురించిన విశేషాలు పంచుకొంటూ..

Jabardasth Fame Anasuya Bharadwaj revealed Kshanam movie offer by Adivi Sesh

2013 సంవత్సరంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌తో కలిసి అమెరికాలో మ్యూజిక్ టూర్ చేశాను. ఆ సమయంలో క్షణంలో నటించమని అడివి శేష్ అడిగారు. అయితే హీరోలందరూ నాకు లైన్ వేయడానికే నన్ను అప్రోచ్ అవుతున్నారని నేను అతడిని దూరం పెట్టాను. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కాఫీ షాప్‌లో నన్ను దొరకబట్టి శేషు కథ చెప్పారు. నేను మూడు నెలల నుంచి ట్రై చేస్తుంటే మీరు దొరకడం లేదని చెప్పారని అనసూయ భరద్వాజ్ తెలిపారు.

నేను జబర్దస్త్‌ కామెడీ షోలో ఓ సీన్‌లో సీరియస్‌గా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూసి.. ఆ లుక్ అడివి శేష్‌కు నచ్చింది. అందుకే ఆయన నన్ను అప్రోచ్ అయ్యారని చెప్పారు. ఆ సమయంలో శేష్ నటుడిగా సెటిల్ కావడానికి కష్టపడుతున్నాడు. చాలా మంచి సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు. ఆ సమయంలో క్షణం మూవీపై అంచనాలు పెట్టుకొన్నారు అని అనసూయ చెప్పారు.

Jabardasth Fame Anasuya Bharadwaj revealed Kshanam movie offer by Adivi Sesh

క్షణం సినిమాలోని నా క్యారెక్టర్‌ కోసం నన్ను ట్రై చేస్తుంటే.. నన్నే ఎందుకు తీసుకొన్నారని అడిగాను. అయితే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే ఒక యాక్టర్‌ను ఆ సినిమా కోసం తీసుకోవాలని అనుకొన్నారు. దాంతో నాకు జబర్దస్త్‌లో ఉన్న పాపులారిటీని చూసి నన్ను తీసుకొన్నారు అని అనసూయ చెప్పారు.

క్షణం సినిమా కోసం నన్ను తీసుకోవడం వల్ల మూవీకి కలిసి వచ్చింది. నేను అంతో ఇంతో నటించడం వల్ల నా పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో నా నటన నాకు నచ్చలేదు. ఇంకా బాగా చేయవచ్చని అనుకొంటాను. ఆ పాత్రలో నన్ను చూసిన ఆడియెన్స్‌కు ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. నా మొదటి సినిమా ప్రయాణం అలా జరిగింది. ఆ తర్వాత నాకు వరుసగా ఆఫర్లు వచ్చాయి అని అనసూయ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X