For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Roja వీడియో క్లిప్పింగ్ వైరల్.. పగిలిపోయేటట్టు వాయించిన జబర్దస్త్ జడ్జి!

  |

  అగ్ర హీరోయిన్‌గా టాప్ రేంజ్‌కు ఎదిగిన అచ్చమైన తెలుగు హీరోయిన్ రోజా టాలీవుడ్‌లో చాలా కాలం వరుస హిట్లతో దూసుకుపోయారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొన్నారు. అటు రాజకీయ రంగంలోను, ఇటు వినోదరంగంలోను అద్భుతంగా రాణిస్తున్న నటి, ఎమ్మెల్యే రోజాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో రోజా ఏం చేశారంటే..

  సర్పయాగం సినిమాతో

  సర్పయాగం సినిమాతో

  సర్పయాగం సినిమాతో టాలీవుడ్‌లోకి 1991లో అడుగుపెట్టిన రోజాకు ఎదురే లేకుండా పోయింది. చిరంజీవి, నాగార్జున లాంటి అగ్రహీరోలతో జతకట్టి మప్పించారు. తెలుగు తమిళ, మలయాళ, కన్నడ రంగాల్లో హీరోయిన్‌గా రాణించింది. దాదాపు 100 చిత్రాల్లో నటించి అగ్రతారగా నిలిచారు. తెలుగులో చివరగా 2013లో డాటర్ ఆఫ్ వర్మ చిత్రంలో నటించారు.

  బుల్లితెర మీద రోజా మ్యాజిక్

  బుల్లితెర మీద రోజా మ్యాజిక్

  ఇటీవల కాలంలో సినీ రంగానికి దాదాపు పూర్తిగా దూరమైనట్టు కనిపిస్తున్న రోజా ఇప్పుడు బుల్లితెరపైన అద్భుతంగా రాణిస్తున్నది. గతంలో బతుకు జట్కా బండి లాంటి షోలతో భారీ ఆదరణను కూడగట్టుకొన్న రోజా ప్రస్తుతం జబర్దస్త్ షోతో మరింత పాపులారిటీని సొంతం చేసుకొన్నారు. సినీ హీరోయిన్‌గా ఏ రేంజ్‌ క్రేజ్‌ను సంపాదించుకొంటే టెలివిజన్ షో హోస్ట్‌గా, న్యాయమూర్తిగా మరింత క్రేజ్‌ను సొంతం చేసుకొంటున్నారు.

  ఖతర్నాక్ పంచులతో రోజా

  ఖతర్నాక్ పంచులతో రోజా

  నటి రోజా ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆ షోను మరో రేంజ్‌కు తీసుకెళ్లడంలో తన పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నారు. కమెడియన్లపై ఖతర్నాక్ పంచులు వేస్తూ ఆకట్టుకొంటున్నారు. కమెడియన్లు వేసే పేల్చే పంచ్ డైలాగ్‌లకు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అందరితో కలిసి ఆనందంగా షోను ఆస్వాదించినట్టు కనిపిస్తారు.

  నగరి నియోజకవర్గంలో పర్యటిస్తూ

  నగరి నియోజకవర్గంలో పర్యటిస్తూ

  ఇక రాజకీయ జీవితంలో బిజీగా ఉంటూనే తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ వ్యవహారాలను చూసుకొంటున్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఎమ్మెల్యేగా విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఎప్పుడూ రోజా తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సాధకభాదకాలు దగ్గరుండి చూసుకొంటారు. ప్రజల కష్టసుఖాలను తనవిగా భావించుకొంటూ ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు.

  సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా

  సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా

  జబర్దస్త్ షోలో పాల్గొంటూనే అవసరమైనప్పుడల్లా తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తుంటారు. కరోనా సమయంలో కూడా తన నియోజకవర్గ ప్రజల గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. తన రెగ్యులర్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గానికి వెళ్లినప్పుడు ఎదో రకంగా వార్తల్లో ఉంటారు. మోటర్ బైక్ నడుపుతూనో లేదా మరో రకంగా మీడియా దృష్టిని ఆకర్షించడమే కాకుండా ప్రజల్లో జోష్‌ను క్రియేట్ చేస్తారు. ఇటీవల డబ్బు వాయిద్యకారుల కార్యక్రమానికి హాజరై రోజా వార్తల్లో నిలిచారు.

  Actor Nani's Golden Heart | సార్.. క్షమించండి అంటూ..!!

  డబ్బు కొడుతూ రోజా హల్‌చల్

  అయితే ఇటీవల నగరి నియోజకవర్గంలో పర్యటించిన రోజా మరోసారి మీడియాను, సోషల్ మీడియాను విశేషంగా ఆకర్షించారు. ఏదో కార్యక్రమంలో కొందరు డబ్బు వాయిస్తుండగా.. తాను కూడా ఓ డబ్బు తీసుకొని లయబద్ధంగా వాయించారు. దాంతో ప్రజలు, అభిమానులు జోష్‌తో సంతోషంలో మునిగిపోయారు. రోజా డప్పు కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తమ అభిమాన నాయకురాలు, హీరోయిన్‌పై కామెంట్లు పెడుతూ మెచ్చుకొంటున్నారు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  MLA Roja visit in MLA for Nagari constituency, provided welfare assistance to drummers in her constituency. In this occassion, She plays drumms with local people. This video goes viral in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X