ఇష్టపడి వెళ్లడమే.. ఎవ్వరు రేప్ చేయరు? అలా వాడకండి.. రష్మీ గౌతమ్ షాకింగ్ కామెంట్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రేప్ కేసు సంఘటనలు కలవరం రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఇలాంటి లైంగిక వేధింపుల కేసులు బయటకు రావడం ఇండస్ట్రీని కుదుపేస్తున్నది. ఇలాంటి వార్తలు ఒక్కొక్కొటి వెలికి వస్తుంటే.. రేపు ఏం జరుగబోతుందో.. ఎవరు బాధితులవుతారో అనే భయం వెంటాడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మీ గౌతమ్ తన పాత ఇంటర్వ్యూ గురించి సోషల్ మీడియాలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ఆ చెప్పిన విషయాల్లోకి వెళితే..

అమ్మాయిలను వేధించడమనేది అన్ని చోట్ల ఉంటుంది. ఒక్క ప్రొఫెషన్‌కో లేదా సినిమా ఇండస్ట్రీకో పరిమితం చేయకూడదు. ప్రతీ అమ్మాయికి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అలాంటి ఆఫర్‌ను రిజెక్ట్ చేయడానికి నో అనే ఒక పదం ఉంటుంది. ఆ వర్డ్‌ను వాడుకోవడం అమ్మాయిలకైనా, సినీ తారలకైనా, సెలబ్రిటీలకైనా రావాలి అని జబర్దస్త్ రష్మీ గౌతమ్ అభిప్రాయపడింది.

Jabardasth Rashmi Gautam Comments on Physical Exploitation and Casting Couch

ఎవరైనా నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే.. వారి కోరికలకు లొంగకూడదు. అలాంటి పని చేయవద్దని అనుకొంటే.. చేయకూడదు. మనమందరం కలిసి ఏదైనా చేయవద్దని అనుకొంటే.. లేదా ఎలాంటి మస్కా మాలిష్ చేయవద్దని అనుకొంటే.. ఎట్టి పరిస్థితుల్లోలైనా దానికి లొంగకూడదు అని రష్మీ గౌతమ్ ఉంటారు.

అయితే బలహీనమైన మనస్తత్వం, తొందరగా ఎదగాలనుకొనే వారు ఉంటారు. ఉదాహరణకు పది మంది అమ్మాయిలు ఉన్నారనుకొంటే.. తొమ్మిది మంది తమ హద్దుల్లో తాము ఉంటారు. ఒక్క అమ్మాయి తొందరగా ఎదగాలని అడ్డదారిలో వెళ్లే వాళ్లు ఉంటారు. వారిని మనం ఏమీ చేయలేం. ఒకరి కొరికలకు లొంగిపోవడమనేది ఒకరి వ్యక్తిగతంగా ఛాయిస్ మాత్రమే అని రష్మీ గౌతమ్ అన్నారు.

Jabardasth Rashmi Gautam Comments on Physical Exploitation and Casting Couch

ఇండస్ట్రీలో నిన్ను ఎవరూ రేప్ చేయరు. నిన్ను ఎవరూ బలవంతం చేయరు. తమకు ఇష్టమై వెళితే తప్పా అది జరగదు. అలాంటి విషయాన్ని పెద్దదిగా చేసి.. ఇష్యూ చేయడమేనది సరికాదు. ఒకరు ఎవరైనా నిజంగా రేప్ చేస్తే.. దానిని సీరియస్‌గా తీసుకోవాల్సిందే అని రష్మీ అన్నారు. అయితే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూను ఓ నెటిజన్ షేర్ చేయగా తాజాగా ఆమె స్పందించింది.

మైనర్‌ను లైంగికంగా వేధించడం, అనుభవంచడం, వివక్ష చూపడమనే విషయం క్యాస్టింగ్ కౌచ్ కిందకు రాదు. క్యాస్టింగ్ కౌచ్ అంటే.. ఒకరి వ్యక్తిగత సుఖం కోసం ఇద్దరు వయోజనులు అంగీకారపూర్వకంగా తీసుకొనే నిర్ణయం. గతంలో నేను ఓ ఇంటర్వ్యూలో చెప్పిన అభిప్రాయాలను ఇప్పుడు షేర్ చేసి దానిని ఆడియెన్స్‌ను మిస్ గైడ్ చేయకూడదు. 2020 సంవత్సరంలో నేను చెప్పిన మాటలు.. ఆ పరిస్థితి వేరు.. ఇప్పుడున్న పరిస్థితి వేరు. వర్క్ ప్లేస్‌లో అమ్మాయిని సౌకర్యంగా ఉంచాలి. ఆమెను గౌరవించాలి అని రష్మీ తాజాగా ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X