175 కోట్ల ఇంద్రభవనంలోకి జాక్వలైన్ ఫెర్నాండేజ్.. యువ పారిశ్రామికవేత్తతో సహజీవనం.. బాయ్‌ఫ్రెండ్ ఎవరంటే!

శ్రీలంకలో పుట్టి బాలీవుడ్‌లో గ్లామర్ పంట పండిస్తున్న ముద్దుగుమ్మ జాక్వలైన్ ఫెర్నాండేజ్ దశ తిరిగినట్టే కనిపిస్తున్నది. గతంలో ఆమె వ్యక్తిగత జీవితం, డేటింగ్, అఫైర్లపై ఎన్నో రూమర్లు, గాసిప్స్ వచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ తాజాగా బాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనం మాత్రం విస్తృతంగా ప్రచారమవుతున్నది. జాక్వలైన్ ఫెర్నాండేజ్ డేటింగ్ వ్యవహారంలోకి వెళితే....

దక్షిణాది పారిశ్రామికవేత్తతో డేటింగ్

దక్షిణాది పారిశ్రామికవేత్తతో డేటింగ్

జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం దక్షిణాదికి చెందిన పారిశ్రామిక వేత్తతో డేటింగ్ చేస్తున్నది. వీరిద్దరూ పీకల్లోతు రొమాన్స్‌లో మునిగి తేలుతున్నారు. వీరిద్దరూ సహజీవనం చేసేందుకు ముంబై సముద్ర తీరంలో ఉన్న ఇంద్ర భవనం లాంటి ఇంట్లోకి జాక్వలైన్ అడుగుపెట్టబోతున్నారు అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది.

సముద్ర తీరానికి చేరువలోని బంగ్లాపై

సముద్ర తీరానికి చేరువలోని బంగ్లాపై

గత కొద్ది కాలంగా బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఓ ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సముద్ర తీరానికి ఎదురుగా ఉన్న ఓ అద్భుతమైన బంగ్లాపై జాక్వలైన్ మనసు పడ్డారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉండటానికి అది పర్‌ఫెక్ట్ బంగ్లా అని తేల్చింది అనే విషయాన్ని బాలీవుడ్ పత్రికలు తమ కథనంలో పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై జాక్వలైన్ గానీ, మరెవరూ కానీ స్పందించకపోవడం గమనార్హం.

ఇంద్రభవనం విలువ 175 కోట్లు

ఇంద్రభవనం విలువ 175 కోట్లు

ప్రముఖ దిన పత్రిక ఎకనామిక్స్ టైమ్స్ వెల్లడించిన ప్రకారం.. జాక్వలైన్ ఫెర్నాండేజ్ సెలెక్ట్ చేసుకొన్న బంగళా అత్యంత విలాసవంతమైనది. దాని విలువ సుమారు రూ.175 కోట్లు. దక్షిణాదికి చెందిన పారిశ్రామిక వేత్తతో కలిసి తిరుగుతూ ఇటీవల కనిపించారు. వారిద్దరు కలిసి ఆ ఇంటిలోకి షిప్ట్ అయ్యేందుకు ప్లాన్ చేశారు. జుహులోని ఆ ఇంటిని ఆ పారిశ్రామిక వేత్త కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి అని కథనంలో వెల్లడించింది.

 ప్రతీ రోజు వీడియో కాన్ఫరెన్స్‌లో

ప్రతీ రోజు వీడియో కాన్ఫరెన్స్‌లో

బాలీవుడ్ పత్రికల కథనం ప్రకారం.. దక్షిణాదికి చెందిన పారిశ్రామికవేత్తతో చాలా సీరియస్‌గా రిలేషన్‌షిప్‌లో ఉంది. ఆ ఇంటిని పూర్తిస్థాయిలో రూపు రేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ రోజు వారిద్దరూ వీడియో కాల్స్‌లో మాట్లాడుకొంటూ ఇంటి గురించి చర్చించుకొంటున్నారు. ఫ్రాన్స్ నుంచి ఇంటీరియర్ డిజైనర్‌ను పిలిపిస్తున్నారు. జాక్వలైన్ ఫెర్నాండేజ్, ఆమె బాయ్‌ఫ్రెండ్ త్వరలోనే ఆ ఇంటిలోకి మూవ్ అయ్యే అవకాశం ఉందనే విషయాలను తమ కథనాల్లో పేర్కొన్నారు.

 జాక్వలైన్ ఫెర్నాండేజ్ సినీ కెరీర్

జాక్వలైన్ ఫెర్నాండేజ్ సినీ కెరీర్

జాక్వలైన్ ఫెర్నాండేజ్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన బూట్ పోలీస్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. రోహిత్ శెట్టి రూపొందిస్తున్న సర్కస్ చిత్రంలోను, అలాగే అక్షయ్ కుమార్‌తో కలిసి బచ్చన్ పాండే మూవీలో నటిస్తున్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్‌ రూపొందిస్తున్న మిస్ సీరియల్ కిల్లర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అలాగే రామ్ సేతు చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X