Jacqueline Fernandezజాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు హాలీవుడ్ ఆఫర్..రక్కమ్మ బ్యూటి రొమాన్స్ చేసే సూపర్‌స్టార్ ఎవరంటే?
బాలీవుడ్‌లో అగ్రహీరోలతో నటిస్తున్న అందాల భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు బంపర్ ఆఫర్ లభించింది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీకి కెరీర్ పరంగా భారీ ప్రమోషన్ లభించింది. ఇప్పటి వరకు పెద్దగా సక్సెస్ కాలేక తడబాటుకు గురవుతున్న హీరోయిన్‌కు హాలీవుడ్‌లో చిత్రంలో నటించే ఆఫర్ లభించడం చర్చనీయాంశమైంది. హాలీవుడ్‌లో ప్రముఖ హీరో నటించే సినిమాలో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు లభించిన ఆఫర్ వివరాల్లోకి వెళితే...
సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలతోపాటు దక్షిణాదిలో ప్రభాస్, కిచ్చ సుదీప్‌తో కలిసి నటించిన జాక్వలైన్‌కు కెరీర్ గ్రాఫ్ అనుకొన్నంత వేగంగా ఎగిసిపడలేదు. రారా రక్కమ్మ పాటతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. అయితే ఇటీవల పలు వివాదాల్లో ఇరుక్కోవడంతో కెరీర్‌కు బ్రేక్ పడింది.

దేశంలోనే పేరు మోసిన నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో అక్రమ సంబంధం జాక్వలైన్ కెరీర్‌ను భారీగా దెబ్బ తీసింది. 200 కోట్ల కుంభకోణంలో సుఖేష్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆమెను ఈడీ అధికారులు విచారించారు. ఇలాంటి ఆరోపణల మధ్య ఆమెకు ఉపశమనంగా మారే హాలీవుడ్ ఆఫర్ లభించడం హాట్ టాపిక్‌గా మారింది.

ఇలాంటి పరిస్థితుల మధ్య జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు జీన్ క్లాడ్ వాన్ డామేతో నటించే అవకాశం లభించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇటలీలో జరిగే షూటింగులో వాన్ డామేతో కలిసి నటించినట్టు తెలిపారు. ఇంకా షూటింగ్ జరుగాల్సింది చాలా ఉంది అని పేర్కొన్నారు.

బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటలీలో వాన్ డామేతో కలిసి నటించాను. హాలీవుడ్ దిగ్గజంతో నటించడం గొప్ప అవకాశం. ఎన్నో ఎగుడుదిగుడులను తట్టుకొని ఓ రేంజ్‌కు ఎదిగిన ఆయనను చూస్తే నాకు ఎంతో స్పూర్తి కలిగించింది అని జాక్వలైన్ ఫెర్నాండేజ్ చెప్పింది.
జీన్ క్లాడ్ వాన్ డామే అంటే నాకు, నా ఫ్యామిలీకి చాలా ఇష్టమైన హీరో. ఆయన సినిమాల కలెక్షన్లు మా ఇంటిలో బోలెడు ఉన్నాయి. అలాంటి దిగ్గజంతో నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. పవర్ ఫుల్ యాక్షన్, డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్‌గాగా ఈ సినిమా రూపొందుతున్నది. ఆయనతో నటించడం గొప్ప అనుభూతి అని జాక్వలైన్ ఫెర్నాండేజ్ తెలిపింది.


Click it and Unblock the Notifications











