30 కోట్ల స్పెషల్ గిఫ్ట్.. స్టార్ హీరోయిన్‌కి జైలులోని బాయ్ ఫ్రెండ్ షాక్..
బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు (Jacqueline Fernandez) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే.. వాలంటైన్స్ డేను పురస్కరించుకొని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు.. జైలు శిక్ష అనుభవిస్తోన్న నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ప్రేమలేఖ రాశాడు. అందులో నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు రూ.30 కోట్ల విలువైన ఖరీదైన బహుమతి ఇస్తున్నానని ప్రకటించాడు. జైలు గోడల మధ్య నుంచే రాసిన భావోద్వేగ ప్రేమ లేఖ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ బహుమతి ఏంటీ?
200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా సుఖేశ్ చంద్రశేఖర్ ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు సుకేష్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో జాక్వెలిన్‌ను 'బొమ్మా', 'ఏంజెల్', 'జాకీ' అంటూ సంబోధించాడు సుఖేశ్. ఇంతటితో ఆగకుండా... తమ ప్రేమకథను రోమియో-జూలియట్, హీర్-రంజా, లైలా-మజ్ను లాంటి ప్రసిద్ధ ప్రేమజంటలతో పోల్చాడు. 'జైలు గోడలు మమ్మల్ని వేరు చేసినా, నా గుండెల్లో నీ పేరే మార్మోగుతోంది' అంటూ భావోద్వేగంగా రాశాడు.

ఫిబ్రవరి 14 తేదీతో రాసిన ఈ చేతిరాత లేఖలో సుఖేశ్, జాక్వెలిన్ ఎదుర్కొంటున్న చట్టపరమైన ఇబ్బందులకు తానే కారణమని సూచిస్తూ క్షమాపణ కూడా చెప్పాడు. త్వరలోనే అన్ని సమస్యలు సర్దుమణిగి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేస్తూ, 'ఈ జన్మలోనే కాదు... ఏ జన్మలోనూ నిన్ను వదలను' అంటూ తన ప్రేమను ప్రకటించాడు.' జైలు గోడలు, ఇనుప తలుపుల మధ్య నిన్ను రోజూ మిస్ అవుతున్నాను' అని రాస్తూ, తాను త్వరలోనే అన్నీ సరిచేసుకుంటానని హామీ ఇచ్చాడు. తమ ప్రేమను ఎలాంటి పరిస్థితులు దెబ్బతీయలేవని, బయటకు వచ్చిన తర్వాత కొత్త జీవితాన్ని మొదలుపెడతామని కూడా లేఖలో పేర్కొన్నాడు.
రూ.30 కోట్ల హెలీకాప్టర్ గిఫ్ట్
ఈ లేఖలో ప్రధానంగా చర్చకు దారితీసిన అంశం.. రూ.30 కోట్ల విలువైన హెలీకాప్టర్ గిఫ్ట్. సుకేశ్ ప్రకారం.. జాక్విలిన్ కోసం ప్రత్యేకంగా ఎయిర్‌బస్ H-సిరీస్ హెలీకాప్టర్ కొనుగోలు చేశానని, దానిపై 'JF' (Jacqueline Fernandez) అనే అక్షరాలు ఎంబోస్ చేయించానని పేర్కొన్నాడు. షూటింగ్‌ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లేందుకు, ముంబై ట్రాఫిక్‌ను అధిగమించేందుకు ఈ హెలీకాప్టర్ ఉపయోగపడుతుందని చెప్పాడు. ఇది అక్రమ సొమ్ముతో కాకుండా తన కష్టార్జితంతో కొనుగోలు చేసినదేనని కూడా పేర్కొన్నారు.
గతంలోనూ ఇలా ప్రకటనలు
ఇది సుకేశ్ చంద్రశేఖర్ ఇలా ప్రకటనలు చేయడం కొత్తేమి కాదు.. గతంలో వాలెంటైన్స్ డే, క్రిస్మస్, నవరాత్రి, జాక్వెలిన్ పుట్టినరోజు సందర్భాల్లో కూడా ప్రైవేట్ జెట్, యాచ్, లగ్జరీ కార్లు, డైమండ్ రింగులు వంటి ఖరీదైన బహుమతులు ఇచ్చానని ప్రకటించాడు. గత ఏడాది గల్ఫ్‌స్ట్రీమ్ ప్రైవేట్ జెట్, లగ్జరీ కార్లు, పెంట్ హౌస్‌లు, ద్రాక్ష తోటలు గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. జాక్విలిన్ పుట్టినరోజు, న్యూ ఇయర్, వాలెంటైన్స్ డే వంటి సందర్భాల్లో ఇలాంటి లేఖలు రాసి వార్తల్లో నిలిచాడు. అయితే, వీటిపై అధికారిక ధృవీకరణ లభించలేదు.
జాక్విలిన్ వైఖరి స్పష్టం
ఇక జాక్విలిన్ ఫెర్నాండెజ్ మాత్రం సుకేశ్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని, అతను చెప్పే ఖరీదైన బహుమతుల గురించి తనకు సమాచారం లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. సుకేశ్ తన పేరును ఉపయోగించి లేఖలు రాయకూడదని, ప్రస్తావించకూడదని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈడీ దర్యాప్తుల నేపథ్యంలో, సుకేశ్ నుంచి వచ్చిన కానుకలు ఆమెకు చట్టపరమైన ఇబ్బందులు తెచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆమె ఈ వ్యవహారంపై పబ్లిక్‌గా స్పందించలేదు.
గిఫ్టా? లేక మైండ్ గేమ్?
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జైల్లో ఉన్న వ్యక్తి ఇలాంటి భారీ గిఫ్ట్ క్లెయిమ్‌లు చేయడం వెనుక మీడియా దృష్టిని ఆకర్షించడం, ఇంకా తన దగ్గర సంపద ఉందనే భావన కల్పించడం వంటి ఉద్దేశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అమలులో ఉన్న ఆస్తుల అటాచ్‌మెంట్ చర్యల మధ్య ఇలాంటి ప్రకటనలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇలా వాలెంటైన్స్ డే రోజున వెలుగులోకి వచ్చిన ఈ లేఖ.. నిజంగా గిఫ్టా? లేక మరో సంచలన ప్రయత్నమా? అన్న ప్రశ్నలు బాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. అధికారికంగా ఏ ధృవీకరణ లేకపోయినా, ఈ వ్యవహారంలో మరోసారి సుకేశ్-జాక్విలిన్ పేర్లను వార్తల్లోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications











