పదేళ్ల నుంచి నమ్మకంతో ఉన్న స్టాఫ్ మెంబర్.. ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందిన నటి అయినప్పటికీ బాలీవుడ్ జనాలకు కొన్ని సినిమాలతోనే చాలా క్లోజ్ అయ్యింది. ఆమెను మొదటిసారి చూస్తే ఎవరైనా సరే ముంబై బ్యూటీ అనే అనుకుంటారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ పరదేశపు భామ తనతో వర్క్ చేసే వారితో కూడా చాలా స్నేహంగా ఉంటుంది. ఇక తనవెంట నమ్మకంతో ఉండేవారిని కూడా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ఆర్థికంగా ఆదుకుంటుంది.

ప్రచారాలు తక్కువ.. సహాయలు ఎక్కువ
లాల్ డౌన్ లో చాలా మంది పేద ప్రజలకు సహాయం చేసిన జాక్వెలిన్ ఎక్కువగా బయటకు చెప్పుకోలేదు. ఎక్కువగా తన చుట్టూ ఉన్న వర్కర్స్ కి ఆమె ఆర్థిక సహాయాన్ని అందించింది. సినిమా ఇండస్ట్రీలో నమ్మకంతో ఉండే జనాలు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి తక్కువమందిని స్టార్స్ ఏ మాత్రం మిస్ చేసుకోరు. వాళ్ళకు అడిగినంత ఇస్తూ తోడుగా ఉంచుకుంటారు.

దసరా సందర్భంగా స్పెషల్ గిఫ్ట్
అసలు మ్యాటర్ లోకి వస్తే.. హీరోయిన్స్ కి కూడా చాలా వరకు పర్సనల్ స్టాఫ్ ఉంటుంది. ఎలాంటి సినిమాకైనా మేకప్ విషయంలో ఒక్కరినే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక జాక్వెలిన్ కూడా చిన్న సాంగ్ కోసమైనా తన పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ లేకుండా ఉండదు. అయితే ఇటీవల ఆమె దసరా సందర్భంగా ఆ టెక్నీషియన్ కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చింది.

పదేళ్లకు పైగా అమెతోనే..
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2009 నుంచి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అయితే పదేళ్ల నుంచి కూడా అమెతోనే ఉంటున్న మేకప్ ఆర్టిస్ట్ కి దసరా రోజు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాక్వెలిన్ షూటింగ్ లో ఉండగా ఆ కారుకు లొకేషన్ లోనే పూజలు చేసింది.
Recommended Video

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్
జాక్వెలిన్ ఆ సమయంలో షూటింగ్ లో బిజీగా ఉండగా కారును షూటింగ్ స్పాట్ కి డెలివరీ చేశారు. ఇక తన మేకప్ ఆర్టిస్ట్ కి పండగ రోజు కారును బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేసిన జాక్వెలిన్ మరోసారి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమెకి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా 46 మిలియన్లకు పెరిగారు.


Click it and Unblock the Notifications











