twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాక్వెలైన్ భేష్. 2500 కుటుంబాల కోసం.. ప్రాణాలను పణంగా పెట్టి..

    |

    కరోనావైరస్ కారణంగా దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఈ ఆపద కాలంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రతీ ఒక్కరిని ఆదుకొనేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ అందించిన స్ఫూర్తితో పలువురు తమ వంతు సాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బాలీవుడ్ భామ జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌ తన వంతు సాయాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే..

    2500 కుటుంబాలకు సహాయం

    2500 కుటుంబాలకు సహాయం

    దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా ముంబైలో కష్టాలు పడుతున్న రోజు వారి కూలీ కుటుంబాలను ఆదుకోవాలని జాక్వలైన్ ఫెర్నాండేజ్ నిర్ణయం తీసుకొన్నారు. బాంద్రా ప్రాంతంలోని అవస్థలు పడుతున్న 2500 మంది కుటుంబాలకు సహాయం అందిస్తున్నారు. తన స్నేహితులు, సన్నిహితుల సహాయంతో ఆహారం, ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు.

    ప్రాణాలకు తెగించి పంపిణీ

    ప్రాణాలకు తెగించి పంపిణీ

    బాంద్రా పరిసర ప్రాంతాల్లో నా స్నేహితులిద్దరూ గొప్ప కార్యానికి పూనుకొన్నారు. రోజువారీ కూలీల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను చేరవేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వారిద్దరూ తమ ప్రాణాలకు తెగించి సహాయం చేస్తున్నారు. నేను అందజేసిన డొనేషన్‌ను సక్రమంగా వినియోగం చేస్తున్నారు అని జాక్వలైన్ పేర్కొన్నారు.

    జాక్వెలైన్‌పై ప్రశంసలు

    ముంబైలోని కూలీల కుటంబాలకు నిత్యావసర వస్తువులను అందజేస్తూ గొప్ప కార్యాన్ని భుజానికెత్తుకొన్న జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాంద్రాలోని 2500 మంది కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా ఒక్కటే అనే భావన కల్పించారు అని ఓ నేత ట్వీట్ చేశారు. ఈ మేరకు ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.

    Recommended Video

    Rana Daggubati's Comeback In April | Oscars 2020 Winners | Rajamouli Trolls RGV
    మహారాష్ట్రను కుదిపేస్తున్న కరోనా

    మహారాష్ట్రను కుదిపేస్తున్న కరోనా

    మహారాష్ట్రను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. దాంతో మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నది. ఈ క్రమంలో రోజు వారీ కూలీల జీవనం స్థంభించింది. ఈ క్రమంలో ప్రముఖులు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు.

    English summary
    Bollywood actor Jacqueline Fernandez helps 2500 families in Bandra in Coronavirus Pandemic. A local leader shared a video that Thank you Asli_Jacqueline for your generous contribution towards the daily wage workers.Asli_Jacqueline has helped us provide groceries to 2500 families in Bandra. We are all in this together!#IndiaFightsCorona.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X