కట్ చెప్పినా హీరోతో శృంగారంలోనే జాక్వలైన్.. లైట్స్ ఆఫ్ చేసి ముద్దుల వర్షం

సినిమాను తెరకెక్కించడం అంత తేలికేం కాదు. తెరపై జరుగుతున్నది డ్రామా అయినా కానీ నిజమే అన్నట్లుగా భ్రమ కల్పించి ప్రేక్షకుడిని అలరించడమే సినిమా గొప్పతనం. ఆడియన్స్‌కి మెచ్చేలా నటించాలన్నా హీరో- హీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ కూడా కీలకమే. అయితే కొందరు హీరో హీరోయిన్లు తెర మీద రొమాంటిక్ సీన్స్ చేయడం సవాల్‌తో కూడిన విషయం. చాలామంది నటీనటులు ఇంటిమేట్ సీన్స్ చేయడంలో ఇబ్బందులపై పలుమార్లు మీడియా ఎదుట తమ కష్టాలు పంచుకున్నారు. అయితే కొందరు హీరో హీరోయిన్లు మాత్రం తమ సహనటుల్ని ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండెేజ్‌కు సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

తన వ్యాఖ్యలు, చేతలతో వివాదాల్లో నిలుస్తుంటుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వలైన్ ఫెర్నాండేజ్. శ్రీలంకకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. తొలుత స్పెషల్ సాంగ్స్‌తో బాలీవుడ్‌లో దుమ్మురేపింది. మర్దర్ 2, హౌస్‌ఫుల్ 2, రేస్ 2, కిక్, విక్రాంత్ రోణ, హౌస్‌ఫుల్ 3, జుద్వా 2 తదితర సినిమాలతో బాలీవుడ్‌లో సత్తా చాటింది. తెలుగులో ప్రభాస్ నటించిన సాహోలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ ఏడాది వెల్‌కమ్ టూ ది జంగిల్ మూవీతో సత్తా చాటింది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.

Jacqueline Fernandez kept kissing Sidharth Malhotra and Tiger Shroff after Director calls cut duing intimate scene

అయితే సినిమాల కంటే వివాదాలతోనే జాక్వలైన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ప్రధానంగా ఆర్దిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌తో ఆమె బంధం వివాదాస్పదమైంది. అతనితో రిలేషన్ కారణంగా దాదాపు 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ఇరుక్కుంది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) రంగంలోకి దిగి విచారణ జరుపుతుండగా.. ఆమె పలుమార్లు అధికారుల ఎదుట హాజరైంది కూడా. అంతేకాదు.. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున జాక్వలైన్‌కు సుకేష్ దాదాపు 30 కోట్ల రూపాయల విలువైన హెలికాఫ్టర్‌ను గిఫ్ట్‌గా పంపడం బాలీవుడ్‌లో కలకలం రేపింది. మనీలాండరింగ్‌తో పాటు ఇతర అభియోగాలపై ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్.. పలు లేఖలు, వాట్సాప్ స్క్రీన్ షాట్స్‌ను వదులుతూ వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నాడు.

ఇదిలాఉండగా.. జాక్వలైన్ ఫెర్నాండేజ్ ముద్దు సన్నివేశాల్లో ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దానిపై ప్రముఖ జర్నలిస్త్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్ హోస్ట్ సిద్ధార్ధ్ కన్నన్ నిర్వహిస్తోన్న సిద్ధార్ధ్ కన్నన్ టాక్ షోకు గెస్ట్‌గా వచ్చిన సిమి చందోక్ అనే ప్రముఖ మీడియా సంస్థ హెడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు దర్శకుడు కట్ అని చెప్పిన తర్వాత కొందరు బాలీవుడ్ నటీనటులు తమ సహనటులను ముద్దు పెట్టుకోవడంపై యాంకర్ ప్రశ్నించగా దీనికి సిమి తనదైన శైలిలో స్పందించారు.

జాక్వలైన్ ఫెర్నాండేజ్ రెండు సందర్భాలలో ఇలానే చేశారని సిమి గుర్తుచేశారు. ఏ జెంటిల్‌మన్ సినిమా షూటింగ్ సమయంలో ఒక లిప్‌లాక్ సీన్ తీస్తుండగా దర్శకుడు కట్ అని చెప్పిన తర్వాత కూడా జాక్వలైన్.. నటుడు సిద్దార్ధ్ మల్హోత్రాను ముద్దు పెట్టుకోవడం ఆపలేదని సిమి తెలిపారు. దర్శకుడు కట్ చెప్పడంతో కిస్సింగ్ సీన్ పూర్తి కావడంతో లైట్లు ఆరిపోయాయి, కెమెరాన్ ఆపేశారు అయినప్పటికీ ఇద్దరూ ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకుంటూనే ఉన్నారు అని సిమి వెల్లడించారు.

అలాగే మరో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన ఏ ఫ్లయింగ్ జాట్ మూవీ చిత్రీకరణ సమయంలోనూ జాక్వలైన్ ఇలానే ప్రవర్తించింది. లిప్ లాక్ సీన్‌ ముగిసినట్లు దర్శకుడు కట్ కట్ కట్ అని పదే పదే పిలిచినప్పటికీ అతని మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా జాక్వలైన్ అతనిని ముద్దుపెట్టుకుంటూనే ఉందని సిమి తెలిపారు. అసలు.. ఓ హెలికాఫ్టర్ కోసం సుకేశ్‌ లాంటి వ్యక్తినే జాక్వలైన్ ముద్దుపెట్టుకోగలిగినప్పుడు.. టైగర్ ష్రాఫ్, సిద్ధార్ధ్ ఎంతో హ్యాండ్సమ్‌గా ఉంటారని సిమి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X