IIFA Awards 2023 లో క్లీవేజ్ షోతో అదరగొట్టిన జాక్వలైన్ ఫెర్నాండేజ్.. ఎద లోతుల్ని అందంగా చూపిస్తూ హంగామా!

బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్ అనేక వివాదాలను దాటుకొని ప్రతిష్టాత్మక ఐఫా రాక్స్ 2023 ఈవెంట్‌లో అడుగుపెట్టింది. రెడ్ కార్పెట్‌పై అందాలను ఒలకబోస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. డిజైనర్ దుస్తుల్లో మెరిసిన ఈ అందాల భామ అభిమానులను తన అందంతో మంత్ర ముగ్దుల్ని చేసింది.దుబాయ్‌లో జరుగుతున్న వేడుకలో తన గ్లామర్ మెరుపులను మెరిపిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే ఈ రేంజ్‌లో తన అందాలను గుప్పించే ముందు జరిగిన తతంగం విషయంలోకి వెళితే..

సుకేష్ చంద్రశేఖర్ కేసులో: ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలను బలవంతంగా బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్ కేసు బాలీవుడ్‌లో సంచలనం రేపింది. సుఖేష్ కేసులో జాక్వలైన్ ఫెర్నాండేజ్ కూడా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మానీ లాండరింగ్ కేసులో పలు దఫాలు జాక్వలైన్ ఈడీ విచారణకు హాజరైంది.

 IIFA Awards 2023

ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన జాక్వలైన్: అయితే అబుదాబీలోని యాస్ ఐలాండ్‌లో జరుగుతున్న ఐఫా అవార్డ్స్ 2023 వేడుకలకు హాజరు కావడానికి ఈడీ అధికారులు నిరాకరించారు. విదేశాలకు వెళ్లకుండా ఆదేశాలు ఉండటంతో జాక్వలైన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. మే 25 నుంచి జూన్ 12వ తేదీ వరకు విదేశాల్లో జరిగే ఐఫా వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. కాబట్టి తనకు వీసా మంజూరు చేసి అక్కడికి వెళ్లేందుకు అనుమతించాలని కోరింది.

విదేశాలకు వెళ్లడానికి కోర్టు అనుమతి: జాక్వలైన్ తరఫు న్యాయవాది ఆమె తరఫున వాదనలు వినిపించారు. తన క్లయింట్‌ ప్రొఫెషనల్‌ వ్యవహారాల కోసం విదేశాలకు వెళ్లే విధంగా అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దాంతో ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొన్న కోర్టు సానుకూలంగా స్పందించి వీసాను మంజూరు చేసింది.అంతేకాకుండా ఇటలీలో జరిగే షూటింగ్‌లో పాల్గొనడానికి అనుమతి కూడా ఇవ్వడం గమనార్హం.

 IIFA Awards 2023

అబుదాబీలో ఐఫా వేడుకల్లో జాక్వలైన్: అబుదాబీలో జరుగుతున్న ఐఫా 2023 వేడుకల్లో జాక్వలైన్ తనదైన శైలిలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మల్టీ కలర్ గౌన్‌లో ఒక షోల్డర్‌పై ఉండే గౌనులో ఆకట్టుకొన్నది. ఎద అందాలను బహిర్గతం చేసి అందాల విందుతో ఆకట్టుకొన్నది. మల్టీ కలర్ డ్రస్సులో సెక్సీ, స్టన్నింగ్‌గా, అందంగా కనిపించింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్, వికీ కౌశల్‌తోపాటు జాక్వలైన్ హోస్ట్ చేసి అందర్నీ ఆకట్టుకొన్నది.

 IIFA Awards 2023

జాక్వలైన్ ఫెర్నాండేజ్ కెరీర్ ఇలా..: సుఖేష్ చంద్రశేఖర్ కేసుల్లో అరోపణలు ఎదుర్కొంటున్న జాక్వలైన్ ఫెర్నాండేజ్ కెరీర్ కాస్త ఆగినట్టు కనిపించింది. కానీ ప్రస్తుతం రెండు భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్ నటించే క్రాక్ సినిమాలో నటిస్తున్నది. అలాగే సోనుసూద్‌తో కలిసి ఫతే సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇంకా పలు ప్రాజెక్టులు గురించి చర్చలు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X