200 కోట్ల కుంభకోణం.. జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు కోర్టులో ఎదురు దెబ్బ!
బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని దాఖలు చేసుకొన్న దరఖాస్తును న్యాయమూర్తి తిరస్కరించారు. మాఫియా డాన్ సుఖేష్ చంద్రశేఖర్‌తో కలిసి 200 కోట్ల కుంభకోణంలో జాక్వలైన్ భాగమయ్యారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దాంతో ఈ వ్యవహారంలో బాలీవుడ్ హీరోయిన్‌కు కోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మనీలాండరింగ్ కేసులో జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు ఆమెపై ఛార్జిషీట్‌ను ఫైల్ చేశారు. ఈ కేసును ఢిల్లీ ట్రయల్ కోర్టులో విచారిస్తున్నది. ఈ వ్యవహారంలో తనపై దాఖలైన సెకండరీ సప్లిమెంటరీ చార్జ్‌షిట్‌ను కొట్టివేయాలని చేసుకొన్న వినతిని న్యాయమూర్తి అనీష్ దయాల్ తోసిపుచ్చారు.

జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది ఆమె పిటిషన్‌ను వ్యతిరేకించారు. ఈ చార్జిషీట్ కేసుకు అత్యంత ప్రధానం కాబట్టి.. ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్ అత్యంత కీలకంగా ఉంటుంది. కాబట్టి ఆ చార్జిషిట్‌ను కొట్టివేయవద్దని లాయర్ కోర్టును అభ్యర్థించారు. దాంతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆమె అభ్యర్థనను తొసిపుచ్చారు.
రాన్ బాక్సీ కంపెనీ ప్రమోటర్స్ శివందర్ సింగ్, మల్విందర్ సింగ్ నుంచి బెదిరించి 200 కోట్ల రూపాయల బలవంతపు వసూళ్ల వ్యవహారంలో మాఫియా డాన్ చంద్రశేఖర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ కేసులో పెద్ద ఎత్తున్న మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఆయన కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులకు జాక్వలైన్ అకౌంట్‌లోకి భారీగా నగదు బదిలీ అయిందనే అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆమెను విచారించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
200 కోట్ల మనీలాండరింగ్ కేసులో చంద్రశేఖర్, ఆయన భార్య లీనా పౌలోస్ ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణలో భాగమయ్యారు. ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ మార్గంలో హావాలా రూపంలో భారీగా నగదు బదిలీ చేశారనే విషయాన్ని ఈఢీ అధికారులు దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మోకా) చట్టాన్ని పునరుద్దించారు.
సుఖేష్ చంద్రశేఖర్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ మధ్య అఫైర్ కొనసాగుతున్నదనే విషయం ఈ కేసు విచారణ సమయంలో వెలుుగలోకి వచ్చింది. వారిద్దరూ అతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ అవ్వడంతో సాక్ష్యాలు లభించాయి. ముంబైలో ఆమెకు ఖరీదైన, విలాసవంతమైన విల్లాను బహుకరించడం, అలాగే విలువైన వస్తువులను గిఫ్టుులుగా ఇచ్చినట్టు విచారణలో బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











