ఆదుకునేందుకు రమ్మంటున్న క్రేజీ హీరోయిన్.. సొంత గడ్డ కోసం ఏం చేస్తోందంటే!

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. హౌస్ ఫుల్ 2, మర్డర్ 2, రేస్ 2 లాంటి చిత్రాల్లో జాక్వెలిన్ నటించింది. కానీ జాక్వెలిన్ క్రేజ్ అమాంతం పెంచిన చిత్రం మాత్రం కిక్. ఈ చిత్రంలో జాక్వెలిన్ సల్మాన్ ఖాన్ సరసన అందాలు ఆరబోసింది. కిక్ చిత్రం తర్వాత జాక్వెలిన్ కు బాలీవుడ్‌లో అవకాశాలు పెరిగాయి. సరైన సక్సెస్ రేట్ లేకపోవడంతో జాక్వెలిన్ పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది.

ఇదిలా ఉండగా ఇటీవల శ్రీలంకలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. దాదాపు 250 మంది అమాయకులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తన సొంత గడ్డపై జరిగిన ఘోరానికి జాక్వెలిన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఉగ్రదాడిలో తమ సొంతవారిని కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబాలని ఆదుకునేందుకు జాక్వెలిన్ ముందుకు వచ్చింది. తాను చేస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ మానవత్వంతో ముందుకు వచ్చి సాయం అందించాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది.

Jacqueline Fernandez releases emotional video after Sri Lanka blasts

ఎవరో చేసిన పనికి అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదులని ముందే పసిగట్టడం కష్టం. ప్రస్తుతం లంక కష్టాల్లో ఉంది. మనమంతా ఒక్కటైతే మాములు స్థితి తీసుకురావచ్చు. భాదితులని ఆదుకునేందుకు ట్రయిల్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నా. ఈ సంస్థ గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సమయం చేస్తోంది. జాతి, మతం, ప్రాంతం భేదాలని పక్కనపెట్టి నాతో చేతులు కలపండి అని జాక్వెలిన్ ప్రజలని కోరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X