ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్: విచిత్రమైన డ్రెస్‌లో అందాలు మొత్తం కనిపించేలా!
ఒకప్పుడు హీరోయిన్లు సినిమాల్లో నటిస్తేనే నిత్యం కనిపిస్తూ ఉండేవారు. కానీ, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు నిరంతరం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటున్నారు. ఇందులో భాగంగానే తమ అందాలను ఆరబోస్తూ వాళ్లకు మజాను పంచుతున్నారు. నిత్యం హాట్ షోతో ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో శ్రీలంకన్ బ్యూటీ.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. చాలా కాలంగా తన అందచందాలతో ఓ ఊపు ఊపుతోన్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడూ శృతి మించిన షో చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్టైలిష్ డ్రెస్‌తో జాక్వెలిన్ రచ్చ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ పిక్‌ను మీరూ చూడండి!

శ్రీలంక నుంచి వచ్చి ఫుల్ ఫేమస్
బాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందిన అమ్మాయి. చదువు పూర్తి చేసుకున్న వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. మిస్ శ్రీలంక యూనివర్స్‌గా ఎంపికైంది. అప్పటి నుంచి అమ్మడు బాగా ఫేమస్ అయింది. మరీ ముఖ్యంగా ఇండియాలో ఎన్నో సందర్భాల్లో పలు ఈవెంట్లు చేసి గుర్తింపు తెచ్చుకుని ఇక్కడ ఫేమస్ అయింది.

అలా పరిచయం.. హిట్ మూవీలు
మోడల్‌గా ఇండియాలోనూ గుర్తింపును తెచ్చుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అలాదిన్'తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'హౌస్‌ఫుల్', 'మర్డర్ 2', 'హౌస్‌ఫుల్ 2', 'రామయ్యా వస్తావయ్యా', 'కిక్', 'జడ్వా 2', 'భాగీ 2', 'రేస్ 3' సహా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

ఫుల్ బిజీగా అయిపోయిన బ్యూటీ
గ్లామర్‌తో మాయ చేయడమే కాదు.. యాక్టింగ్‌లోనూ మెప్పిస్తోన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె ఏకంగా ఐదు హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటిస్తోన్న 'అటాక్', 'సర్కస్', 'బచ్చన్ పాండే', 'రామ్ సేతు' వంటి చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇటీవలే 'బూత్ పోలీస్' విడుదలైంది.

తెలుగులో కూడా పరిచయమైంది
బాలీవుడ్‌తో పాటు శ్రీలంకన్, బ్రిటీష్‌తో పాటు పలు భాషల చిత్రాల్లో నటించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో'లో 'బ్యాడ్ బాయ్' అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఇది సూపర్ హిట్ అయింది. ఇక, పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబోలో రాబోతున్న 'హరిహర వీరమల్లు'లోనూ ఆమె నటిస్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ ముద్దుగుమ్మ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకుంటూ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఎక్కువగా అలాంటివే వదులుతూ
నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే జాక్వెలిన్.. ఎక్కువ శాతం గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, ఘాటు సెల్ఫీలు, బట్టలు లేకుండా దిగిన పిక్స్‌ను షేర్ చేస్తూ కుర్రకారులో హీట్ పెంచేస్తుంది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఈమె ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
Recommended Video

హాట్ ఫొటోతో రెచ్చిపోయిన భామ
తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఓ స్టైలిష్ డ్రెస్ ధరించి ఉంది. ఇందులో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











