For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాప్‌లెస్ ఫొటోతో ప్రభాస్ హీరోయిన్ రచ్చ.. ఆనందంలో కుర్రాళ్ల మతిపోగొడుతోన్న బ్యూటీ.!

  By Manoj Kumar P
  |

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో సినీ పరిశ్రమకు చెందిన వారే ఎక్కువ. మరీ ముఖ్యంగా నటీమణులు చాలా మంది తమ అందాలతో కుర్రాళ్ల గుండెళ్లో గునపాలు గుచ్చుతున్నారు. ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ తక్కువ సినిమాలే చేసినా ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. ఈ జాబితాలోకే వచ్చి చేరుతుంది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆ మధ్య ప్రభాస్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. తాజాగా టాప్‌లెస్ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. ఇంతకీ ఆమె ఎందుకిలా చేసింది.? వివరాల్లోకి వెళితే...

  పక్క దేశమే... ఇక్కడ ఫేమస్

  పక్క దేశమే... ఇక్కడ ఫేమస్

  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మన పక్క దేశమైన శ్రీలంకకు చెందిన అమ్మాయి. చదువు పూర్తి చేసుకున్న వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. మిస్ శ్రీలంక యూనివర్స్‌‌గా గెలుపొందింది. అప్పటి నుంచి అమ్మడు బాగా ఫేమస్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ఇండియాలో ఎన్నో సందర్భాల్లో పలు ఈవెంట్లు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా ఇక్కడ కూడా పాపులర్ అయింది.

  అలాదిన్‌తో ఎంట్రీ.. బాగా బిజీ

  అలాదిన్‌తో ఎంట్రీ.. బాగా బిజీ

  అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అలాదిన్'తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆ తర్వాత ‘హౌస్‌ఫుల్', ‘మర్డర్ 2', ‘హౌస్‌ఫుల్ 2', ‘రామయ్యా వస్తావయ్యా', ‘కిక్', ‘జడ్వా 2', ‘భాగీ 2', ‘రేస్ 3' సహా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

   ప్రభాస్‌తో మొదలు.. పవన్‌తో

  ప్రభాస్‌తో మొదలు.. పవన్‌తో

  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హిందీతో పాటు శ్రీలంకన్, బ్రిటీష్‌తో పాటు పలు భాషల చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో'లో ‘బ్యాడ్ బాయ్' అనే స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇది సూపర్ హిట్ అయింది. ఇక, పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న ‘విరూపక్ష'లోనూ ఆమె నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  అక్కడ హల్‌చల్.. రికార్డులు

  అక్కడ హల్‌చల్.. రికార్డులు

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ ముద్దుగుమ్మ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకుంటూ రికార్డు క్రియేట్ చేస్తోంది.

  టాప్‌లెస్ ఫొటోతో రచ్చ రచ్చ

  టాప్‌లెస్ ఫొటోతో రచ్చ రచ్చ

  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరచూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇప్పటికే తన అందాలను కనివిందు చేస్తూ ఎన్నో ఫొటోలను వదిలిన ఆమె.. ఎక్కువగా బికినీ పిక్స్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె టాప్‌లెస్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే, ఈ ఫొటోల్లో తన ఎద భాగంలో పూలను అడ్డుగా పెట్టుకుంది.

  #BadBoySongFromSaho : Prabhas Romance With Jacqueline Fernandez || Filmibeat Telugu
  ఆ ఆనందంతోనే ఇలా చేసింది

  ఆ ఆనందంతోనే ఇలా చేసింది

  శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 46 మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకుంది. ఈ ఆనందంలోనే ఆమె తన టాప్‌లెస్ ఫొటోలను షేర్ చేసింది. బాలీవుడ్ హాట్ లేడీ షేర్ చేసిన ఈ ఫొటోలకు విపరీతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ పిక్స్‌కు మిలియన్‌కు పైగా లైకులు రావడం విశేషం. దీంతో అమ్మడు మరోసారి హైలైట్ అవుతోంది.

  English summary
  Bollywood actress Jacqueline Fernandez rings in her 34 birthday with friends and family and she is busy partying on the beaches of Sri Lanka proving age is just a number. In the videos and pictures shared by the 'Kick' actress on her Instagram handle, she looks breathtaking in a floral monokini.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X