Jahnvi Kapoor లవర్‌తో అఫైర్ లీక్.. అడ్డంగా బుక్కైన జాన్వీ కపూర్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి జాన్వీ కపూర్ ఒకరు. ఈమె శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ధడక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి జాన్వీ కపూర్ ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే మొదటిసారి ఈమె సౌత్ సినిమాలకు కూడా కమిట్ అవుతూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్నటువంటి దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఈమె సినీ కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు షికర్ పహరియాతో డేటింగ్లో ఉన్నట్లు మీడియాలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి అనుకూలంగా వీరిద్దరూ కలిసి పలు సందర్భాలలో మీడియా కంటపడటం అలాగే ఈమె తండ్రి బోనీ కపూర్ కూడా షికర్ గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించడం వంటివి చూస్తుంటే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.
తాజాగా మరోసారి జాన్వీ కపూర్ అడ్డంగా దొరికిపోయారు. ఇటీవల తన తండ్రి నిర్మించినటువంటి మైదాన్ సినిమా ప్రమోషన్స్ లో ప్యాంట్ సూట్ వేసుకుని మీడియా ముందుకు వచ్చింది. జాన్వీ వేసుకున్నటువంటి ఈ డ్రెస్ కంటే ఆమె మెడలో ఉన్నటువంటి డైమండ్ నెక్లెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ డైమండ్ నెక్లెస్ పై ఏకంగా తన ప్రియుడు పేరు ఉండడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

ఈమె మెడలో వేసుకున్నటువంటి ఈ డైమండ్ నెక్లెస్ పై షికు పేరు ఉండటాన్ని అందరూ ఎక్కువగా గమనించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ డైమండ్ నెక్లెస్ ద్వారా ప్రియుడి పేరు చెప్పకనే చెప్పేశారు. ఇక వీరిద్దరూ కలిసి పలు ఆలయాలకు వెళ్తూ జంటగా కనిపించారు. ఇటీవల జాన్వీ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కలిసి తిరుమల స్వామి వారిని కూడా దర్శించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్న విషయాన్ని ప్రత్యక్షంగా చెప్పకపోయినా ఇలా పలు సందర్భాలలో జాన్వీ పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











