Parvati Melton అర్ధనగ్న అవతారంలో పార్వతి మెల్టన్..లేటు వయసులో కూడా తరగని అందాలతో జల్సా హీరోయిన్!
సోషల్ మీడియా వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో అన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి.. అప్పటి హీరోయిన్లు ఇప్పుడేం చేస్తున్నారు.. ఎలా ఉన్నారు అనేది తెలుసుకోలేకపోతున్నాం. కానీ, సోషల్ మీడియా వచ్చాకా.. కొంతమంది హీరోయిన్లు తమ ఉనికిని తెలియజేసేలా వాడుకుంటున్నారు. అంటే.. పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గర అవుతున్నారు.
అందచందాలను చూపిస్తూ అవకాశాల ఇమ్మని ఇన్ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన సగం మంది సీనియర్ హీరోయిన్లు.. సోషల్ మీడియా వలన వచ్చినవారే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. తాజాగా మరో సీనియర్ బ్యూటీ ఈ సోషల్ మీడియా వేదికగా అందచందాలను ఆరబోస్తూ.. మళ్లీ రీఎంట్రీ కోసం కష్టపడుతుంది. ఆమె ఎవరో చూద్దాం రండి.

వెన్నెల సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పార్వతి మెల్టన్. టాలీవుడ్ లో టాల్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే పార్వతి పేరు కూడా అందులో ఉంటుంది.పార్వతీ మెల్టన్ భరత నాట్యం తో పాటు పలు రకాల డాన్స్ ల్లో ప్రావిణ్యం ను సొంతం చేసుకుని మిస్ టీన్ ఇండియా బే ఏరియా పోటీ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే.
అందం, అభినయం కలబోసిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకుంది. దీని తరువాత అమ్మడి లైఫ్ మారిపోతుంది అనుకున్నారు కానీ, ఆమెకు ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. గేమ్, అల్లరి అల్లరి, మధుమాసం లాంటి సినిమాలు చేసింది కానీ, హిట్స్ అందలేదు. ఇక అప్ప్పుడు వచ్చింది అమ్మడికి జల్సా ఆఫర్.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ కు ఎంతో స్పెషల్ అని చెప్పాలి. జల్సాకు ముందు వరకు వరుస ప్లాప్ లో ఉన్నాడు. ఆ సమయంలోనే త్రివిక్రమ్ జల్సా కథ చెప్పుకొచ్చాడు. ఆ కథ నచ్చడంతో పవన్ వెంటనే ఓకే చెప్పాడు. హీరోయిన్ గా ఇలియానా నటించగా.. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో పార్వతి నటించింది. హీరోయిన్ ఫ్రెండ్ అయినా కూడా ఆమెకు ఒక సాంగ్ కూడా పెట్టాడు త్రివిక్రమ్. జెన్నిఫర్ లోఫెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ చిన్నది అంటూ ఇప్పటికీ కుర్రాళ్లు ఆలపిస్తున్న ఈ సాంగ్ లో జెన్నిఫర్ పార్వతినే.
జల్సా సినిమా అమ్మడికి మంచి హిట్ ను అందించింది కానీ అవకాశాలను మాత్రం అందివ్వలేకపోయింది. దీంతో ఈ చిన్నది ఐటెంసాంగ్ కూడా సై అంది. అలా దూకుడు సినిమాలో మహేష్ సరసన పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావు సాంగ్ లో ఆడిపాడింది. దీని తరువాత కూడా అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో ఆఫర్లు తగ్గాయి.
ఇక చేసేది ఏం లేక 2003 లో ఈ చిన్నది ఒక వ్యాపారవేత్తను పెళ్ళాడి ఇండస్టీకి దూరమైంది. సినిమాలకు దశాబ్ద కాలంగా దూరంగా ఉంటున్న ఈ అమ్మడు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాపై అందాల దాడికి దిగింది. ఇప్పుడు మరింత గ్లామర్ గా తయారయిన ఈ భామ అందాల ఆరబోత తట్టుకోవడం కష్టమే అన్నట్లుగా ఉంది.
బికినీ ట్రీట్ తో కుర్రాళ్లను కిర్రెక్కిస్తోంది. బీచ్ ఒడ్డున బికినిలో అమ్మడిని ఇలా చూసి నెటిజన్ల మతులు పోతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ అందాల ఆరబోత వర్క్ అవుట్ అయ్యి పార్వతి రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











