చర్చిలు , మసీదులు ప్రభుత్వ ఆధీనంలో ఎందుకుండవు .. ఇదేనా సెక్యులరిజం : రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

రేణు దేశాయ్ .. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా, సినీనటిగా ఆమెకు మంచి గుర్తింపే ఉంది. పవన్‌తో విడాకుల తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె ఎవరిపైనా ఆధారపడకుండా బతుకుతోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేణు దేశాయ్.. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన సంగతులను పంచుకుంటూ ఉంటుంది. అలాగే దేశ కాలమాన పరిస్ధితులపైనా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా ఏ విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడటం రేణుకి అలవాటు. పవన్‌తో వైవాహిక జీవితం , విడాకులు, పిల్లల పెంపకం ఇలా తన జోలికి వచ్చిన వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేస్తుంది రేణు.

ఈ నేపథ్యంలో భారతదేశంలో సెక్యులరిజం, ప్రస్తుత పరిణామాలపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దేశంలోని చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో ఉండవని, కేవలం హిందూ ఆలయాలు మాత్రమే గవర్నమెంట్ అండర్‌లో ఉంటాయని అలాంటప్పుడు ఇండియా సెక్యులర్ దేశం ఎలా అవుతుందని రేణు ప్రశ్నించారు. ఆలయాలను నడిపే ట్రస్ట్‌లు, ఇతర కమిటీలకు ఇతర మతాలకు సారథ్యం వహించడం ఏంటని ఆమె నిలదీశారు. ప్రస్తుతం రేణు దేశాయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

janasena chief Pawan Kalyan s ex wife actress Renu Desai made sensational comments on secularism in india

దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. బాలీవుడ్ స్టార్లు సైతం మాట్లాడేందుకు భయపడే విషయాలను ప్రస్తావించిందని కొందరు కొనియాడారు. మరికొందరు పవన్ కళ్యాణ్ ఏసుక్రీస్తు ఫోటోతో ఉన్న పిక్స్‌ను షేర్ చేస్తూ ఆయన క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇంతకీ రేణు దేశాయ్ ఎవరిని, ఏ పార్టీని, ఏ సంస్థను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనేది చర్చనీయాంశమైంది.

janasena chief Pawan Kalyan s ex wife actress Renu Desai made sensational comments on secularism in india

దేశంలోని ప్రముఖ హిందూ ఆలయ కమిటీలను ఇతర మతస్తులు నడుపుతున్నారనేది ఆమె భావన కావొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్‌లుగా తనకు అత్యంత సన్నిహితులైన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను నియమించారు. ఈ రెండు సందర్భాల్లోనూ జగన్ ప్రభుత్వంపై సాంప్రదాయవాదులు మండిపడ్డారు. పవిత్రమైన తిరుమల ఆలయ వ్యవహారాలను చూసే బాధ్యతను నిర్వర్తించేందుకు , హిందువుల్లో ఎవరూ దొరకనట్లు జగన్‌కు క్రైస్తవ మతాన్ని అనుసరించే వారే దొరికారా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలు ఖండించారు.

పవన్ కళ్యాణ్ సైతం జగన్ పాలనలో హిందూ ఆలయాలు, దేవతా విగ్రహాల ధ్వంసంపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని, పాకిస్తాన్‌లోనే ఇలా జరుగుతుందని పేపర్లలో చదివేవాళ్లమని.. కానీ జగన్ వచ్చాక ఏపీలోనూ అదే తరహాలో హిందూ విగ్రహాల ధ్వంసాన్ని చూస్తున్నామని పవన్ తీవ్ర విమర్శలు చేశారు. తన ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలోనూ పవన్ ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. తాజాగా అతని మాజీ భార్య రేణు దేశాయ్ సైతం దేశంలో సెక్యులరిజం, హిందూ ఆలయాల నిర్వహణపై వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X